సరైన సమయంలో గుర్తించకపోతే ఇది లివర్ సిరోసిస్ లేదా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది. ప్రస్తుతం చాలామంది భారతీయుల్లో ఒక సాధారణ శత్రువు దాగి ఉంటున్నాడు. పైకి ఎటువంటి లక్షణాలు కనిపించకుండానే కాలేయాన్ని నాశనం చేసే ఆ ‘సైలెంట్ కిల్లర్’ పేరు ఫ్యాటీ లివర్. భారతదేశంలో దాదాపు 39 శాతం మంది పెద్దలు ఈ సమస్యతో సతమతమవుతున్నారని పరిశోధనలు చెబుతున్నాయి. కేవలం కాలేయమే కాదు, ఇది మీ గుండె, మెదడు, కిడ్నీలను కూడా దెబ్బతీస్తుంది.
- ఫ్యాటీ లివర్ అంటే కేవలం కాలేయానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. కాలేయంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు వల్ల శరీరంలోని ఇతర అవయవాలు కూడా దెబ్బతింటాయి:
- ఇది కొలెస్ట్రాల్‌ను పెంచి గుండెపోటు, స్ట్రోక్ ముప్పును పెంచుతుంది.
- ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల టైప్-2 డయాబెటిస్ వచ్చేలా చేస్తుంది.
- దీర్ఘకాలిక మంట వల్ల జ్ఞాపకశక్తి తగ్గడం, మతిమరుపు వంటి సమస్యలు వస్తాయి.
- అధిక రక్తపోటు, షుగర్ లెవల్స్ వల్ల కిడ్నీ పనితీరు మందగిస్తుంది.
మన వంటగదిలోనే కాలేయాన్ని శుభ్రపరిచే అద్భుతమైన ఆహార పదార్థాలు ఉన్నాయి. కాలేయాన్ని కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే.
ఆకుకూరలు:
పాలకూర, తోటకూర, మెంతికూరలో ఉండే ఫైబర్ కాలేయంలోని కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది.
పండ్లు:
బెర్రీలు, ఆపిల్స్, నిమ్మజాతి పండ్లు విషతుల్యాలను బయటకు పంపి మెటబాలిజంను పెంచుతాయి.
తృణధాన్యాలు:
ఓట్స్, బ్రౌన్ రైస్ వంటివి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించి కాలేయంపై ఒత్తిడిని తగ్గిస్తాయి.
నట్స్
బాదం, వాల్‌నట్స్ లో ఉండే విటమిన్-E కాలేయ వాపును తగ్గిస్తుంది.
చేపలు
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే చేపలు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ఆలివ్ ఆయిల్:
ఇది కాలేయ ఎంజైమ్ల స్థాయిని మెరుగుపరిచి, కొవ్వు పేరుకుపోకుండా చూస్తుంది.
ఫ్యాటీ లివర్ బారి నుండి తప్పించుకోవాలంటే ప్రాసెస్ చేసిన ఆహారం, వేయించిన తినుబండారాలు మరియు చక్కెరను తగ్గించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల కాలేయాన్ని మళ్ళీ ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. మద్యం సేవించే అలవాటు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. కాలేయం మన శరీరానికి పవర్ హౌస్ లాంటిది. దానికి తగిన విశ్రాంతి, సరైన ఆహారం అందిస్తే అది మిమ్మల్ని దశాబ్దాల పాటు ఆరోగ్యంగా ఉంచుతుంది.