Faria Abdullah: క్యూట్ చిట్టి కాస్తా హాట్ బాంబ్‌గా.. గ్లామర్ షోతో టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న ఫరియా

Faria Abdullah: క్యూట్ చిట్టి కాస్తా హాట్ బాంబ్‌గా.. గ్లామర్ షోతో టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న ఫరియా


Faria Abdullah: క్యూట్ చిట్టి కాస్తా హాట్ బాంబ్‌గా.. గ్లామర్ షోతో టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న ఫరియా

‘జాతి రత్నాలు’ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన చిట్టి గుర్తుంది కదా..! అప్పట్లో తన ఇన్నోసెన్స్‌తో ఆకట్టుకున్న ఫరియా అబ్దుల్లా.. ఇప్పుడు నెక్ట్స్ లెవల్ గ్లామర్ షోతో కుర్రాళ్ల మతులు చెడగొడుతోంది. నిన్న మొన్నటి వరకు పద్ధతిగా కనిపించిన ఈ ఆరడుగుల సుందరి.. ఇప్పుడు సడెన్‌గా గేర్ మార్చింది. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఆమె తాజా ఫోటోషూట్ చూస్తుంటే మతులు చెడిపోవడం కాదు.. మాస్‌గా చెప్పాలంటే జనాలు ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. అసలు ఆ రేంజ్ ఎక్స్‌పోజింగ్ చూసి నెటిజన్లకే కాదు.. ఇండస్ట్రీ వర్గాలకు సైతం మైండ్ బ్లాక్ అవుతోంది. ఫరియా ఇలా సడెన్‌గా రూట్ మార్చడానికి బలమైన కారణమే కనిపిస్తోంది. టాలెంట్ ఎంత ఉన్నా అవకాశాలు రానపుడు ఈ చిట్టి అంతకంటే ఏం చేస్తుంది పాపం..? అచ్చమైన తెలుగమ్మాయి కావడం కూడా ఫరియాకు కలిసి రావడం లేదేమో మరి..?

ఎందుకంటే టాలీవుడ్‌లో మన దగ్గర తెలుగమ్మాయిలు స్టార్స్ అయిన సందర్భాలు చాలా తక్కువే. నార్త్ నుంచి వచ్చిన భామలకే మనోళ్లు రెడ్ కార్పెట్ పరుస్తుంటారు. ఫరియా కూడా తన కెరీర్ మొదలైనప్పటి నుంచి చిన్న హీరోలతో అవకాశాలు అందుకుంటుంది కానీ.. బ్రేక్ ఇచ్చి కెరీర్ మార్చేసే అవకాశం మాత్రం ఇప్పటి వరకు రాలేదు. అసలు ఫరియా చేసిన సినిమాలు ఎన్ని..? అని లెక్కలేస్తే.. 2021లో ‘జాతిరత్నాలు’తో సూపర్ హిట్ కొట్టాక ఆమెకు ఆ రేంజ్ సక్సెస్ రాలేదు. ఆ తర్వాత ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘బంగార్రాజు’, ‘కల్కి 2898 AD’ లాంటి సినిమాల్లో చిన్న చిన్న క్యామియోలు, స్పెషల్ సాంగ్స్ చేసింది. ఇక ఫుల్ లెంగ్త్ హీరోయిన్‌గా ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’, ‘రావణాసుర’, ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాలు ఆడలేదు. ‘మత్తు వదలరా 2’.. ఆడినా ఆమెకు వర్కవుట్ అవ్వలేదు.

మొత్తంగా ఒక 8-9 సినిమాల్లో మాత్రమే నటించింది. అయితే వీటిలో కొన్ని హిట్స్ ఉన్నా కూడా ఆ క్రెడిట్ అంతా హీరోలకే వెళ్లింది కానీ.. హీరోయిన్‌గా ఫరియాను టాప్ లీగ్‌లో కూర్చోబెట్టలేకపోయాయి. అందుకే గ్లామర్ వైపు ఎందుకు టర్న్ తీసుకుంది అనే దానికి క్లియర్ కట్ ఆన్సర్ ఆమె కెరీర్ గ్రాఫ్‌లోనే ఉంది. కేవలం పద్ధతిగా, నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తే క్యారెక్టర్ రోల్స్ లేదా చిన్న సినిమాలే వస్తాయని ఈ బ్యూటీకి బాగా అర్థమైనట్లుంది. అందుకే తనలో కూడా కమర్షియల్ యాంగిల్ ఉందని మేకర్స్‌కు గట్టిగా హింట్ ఇవ్వడానికే గ్లామర్ డోర్స్ పూర్తిగా ఓపెన్ చేసింది. ప్యాన్ ఇండియా రేంజ్ సినిమాల్లో స్టార్ హీరోల పక్కన మాస్ సాంగ్స్ చేయాలన్నా, బీచ్‌లలో బికినీలు వేయాలన్నా తను రెడీ అన్నట్లుగా సిగ్నల్స్ ఇస్తోంది.

మొత్తానికి ఇండస్ట్రీలో నిలబడాలంటే ఆ మాత్రం ఎక్స్‌పోజింగ్ తప్పదన్న ఫార్ములాను ఫరియా గట్టిగానే వంటపట్టించుకుని బరిలోకి దిగింది. అయితే టాలెంట్ ఉండి, గ్లామర్ ఒలకబోసినా.. ఇండస్ట్రీలో క్లిక్ అవ్వాలంటే టైమ్ కూడా కలిసి రావాలి. మరి అందాలు ఆరబోస్తూ ఫరియా చేస్తున్న ఈ గ్లామర్ షో అవకాశాలు తెచ్చి పెడుతుందా..? స్టార్ హీరోల పక్కన కమర్షియల్ హీరోయిన్‌గా సెట్ అవ్వాలన్న ఈ తెలుగమ్మాయి కల నెరవేరుతుందా..? అనేది రాబోయే రోజుల్లో తేలిపోనుంది.

 

View this post on Instagram

 

A post shared by Faria Abdullah (@fariaabdullah)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *