“PhleDekhoPhleSikho” అనే యూట్యూబ్ ఛానల్ వీడియోలో భారత కేంద్ర ప్రభుత్వం “బెరోజ్‌గరి భట్ట యోజన 2025” అనే పథకం కింద నిరుద్యోగ యువత అందరికీ నెలకు రూ.2,500 అందిస్తున్నట్లు ఒక వీడియో పోస్ట్ చేసింది. దీంతో చాలా మంది ఆ పథకం గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపించారు. అయితే నిజంగానే కేంద్ర ప్రభుత్వం అలాంటి పథకం తీసుకొచ్చిందా? లేదా అనేది PIB ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ ఆ సమాచారం నకిలీదని ధృవీకరించింది. కేంద్ర ప్రభుత్వం కింద అలాంటి నిరుద్యోగ భృతి పథకం లేదని PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. ఈ వాదన పూర్తిగా నకిలీది, అధికారికంగా ప్రకటించిన ఏ విధానంలోనూ దీనికి ఎటువంటి ఆధారం లేదని వెల్లడించింది. గతంలో భారత ప్రభుత్వం నిరుద్యోగ యువతకు రూ.3,500 ఇస్తున్నట్లు పేర్కొంటూ ఒక వాట్సాప్ సందేశం సైతం వైరల్ అయింది.
భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి బెరోజ్గర్ భట్టా యోజన కింద నెలకు రూ.3500 అందిస్తున్నట్లు పేర్కొంటూ మీకు వాట్సాప్ ఫార్వర్డ్ కూడా వచ్చిందా? భారత ప్రభుత్వం అలాంటి పథకాన్ని నిర్వహించడం లేదు అని PIB ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయులందరికీ 3 నెలల ఉచిత మొబైల్ రీఛార్జ్‌ను అందిస్తున్నారనే ప్రచారాన్ని కూడా PIB తప్పుడు సమాచారం అని స్పష్టం చేసింది. ఇటువంటి తప్పుడు సమాచారం నుండి తప్పించుకోవడానికి, పౌరులు నవీకరణల కోసం PIB లేదా ప్రభుత్వ వెబ్సైట్ల వంటి అధికారిక వనరులపై ఆధారపడాలని సూచించింది.
दावा: ” बेरोजागरी भत्ता योजना ” के तहत बेरोजगार युवाओं को प्रतिमाह ₹2500 दिए जाएंगे। #PIBFactCheck
❌ #Youtube चैनल “PhleDekhoPhleSikho” के वीडियो में किया जा रहा यह दावा #फर्जी है।
🔹 केंद्र सरकार से संबंधित किसी भी प्रकार की संदिग्ध तस्वीरें, वीडियो अथवा संदेश… pic.twitter.com/suDGG1SjcE
— PIB Fact Check (@PIBFactCheck) September 29, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి