Fact Check: తెలంగాణలో వారికి ఫ్రీ బస్ స్కీమ్.. అసలు నిజం ఏంటంటే..?

Fact Check: తెలంగాణలో వారికి ఫ్రీ బస్ స్కీమ్.. అసలు నిజం ఏంటంటే..?


గత కొన్ని రోజులుగా తెలంగాణలో దివ్యాంగులకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్‌గా మారింది. ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అదంతా తప్పుడు సమాచారమని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం రంగంలోకి దిగింది. ఈ వైరల్ వార్తను ఖండిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం గానీ, ఆర్టీసీ యాజమాన్యం గానీ ఎలాంటి జీవో లేదా సర్క్యులర్ జారీ చేయలేదు. మహాలక్ష్మి పథకం కేవలం తెలంగాణకు చెందిన మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు మాత్రమే వర్తిస్తుంది. వీరు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఉత్తర్వులు నకిలీవని, ప్రజలు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తప్పుడు సమాచారాన్ని సృష్టించడం, వ్యాప్తి చేయడం నేరమని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా నకిలీ జీవోలను వైరల్ చేస్తున్న వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం స్పష్టం చేసింది. ప్రభుత్వం నుండి వచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని.. వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి వేదికల్లో వచ్చే జీవోల క్యూఆర్ కోడ్‌లను గుడ్డిగా నమ్మకూడదని తెలిపింది.

ప్రస్తుతానికి దివ్యాంగులకు గతంలో ఉన్న రాయితీలు యధావిధిగా కొనసాగుతున్నాయి. ఉచిత ప్రయాణంపై ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ప్రయాణికులు కండక్టర్లకు సహకరించాలని, తప్పుడు వార్తలను షేర్ చేయవద్దని విజ్ఞప్తి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *