Expensive Players: ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత ఖరీదైన ఆటగాళ్లు.. లిస్ట్‌లో మనోళ్లు ఐదుగురు.. ఆ పేరు షాకింగ్ భయ్యో..!

Expensive Players: ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత ఖరీదైన ఆటగాళ్లు.. లిస్ట్‌లో మనోళ్లు ఐదుగురు.. ఆ పేరు షాకింగ్ భయ్యో..!


Expensive Players: ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత ఖరీదైన ఆటగాళ్లు.. లిస్ట్‌లో మనోళ్లు ఐదుగురు.. ఆ పేరు షాకింగ్ భయ్యో..!

Most Expensive IPL Players: టీ20 ప్రపంచకప్ 2026 ముగిసింది. అయితే, మరో రెండు వారాల్లో ఐపీఎల్ మొదలుకానుంది. ఈ క్రమంలో ఐపీఎల్ హిస్టరీని తెలుసుకునేందుకు ఫ్యాన్స్ తెగ వెతుకున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్‌గా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది జరిగే వేలంలో ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు భారీ మొత్తాలు ఖర్చు చేస్తుంటాయి. కొంతమంది ఆటగాళ్లు తమ ప్రతిభతో రికార్డు ధరలకు కొనుగోలు అవుతూ ఐపీఎల్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించారు.

ఇప్పుడు ఐపీఎల్ 19 ఏళ్ల చరిత్రలో అత్యంత ఖరీదైన టాప్-10 ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.. టాప్ 10 ఖరీదైన కొనుగోళ్లు..

10. అర్ష్‌దీప్ సింగ్ – రూ. 18.00 కోట్లు (PBKS, 2025)

ఐపీఎల్ 2025 మెగా వేలంలో అర్ష్‌దీప్ సింగ్‌ను పంజాబ్ కింగ్స్ రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తీవ్ర పోటీ తర్వాత పంజాబ్ RTM కార్డ్ ఉపయోగించి అతన్ని తిరిగి జట్టులోకి తీసుకుంది.

9. యుజ్వేంద్ర చాహల్ – రూ. 18.00 కోట్లు (PBKS, 2025)

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన లెగ్ స్పిన్నర్ చాహల్‌ను కూడా పంజాబ్ కింగ్స్ రూ. 18 కోట్లకు దక్కించుకుంది. అనేక జట్లు పోటీ పడిన తర్వాత అతన్ని తమ ప్రధాన బౌలర్‌గా ఎంపిక చేసింది.

8. మతీషా పతిరణ – రూ. 18.00 కోట్లు (KKR, 2026)

ఐపీఎల్ 2026 మినీ వేలంలో శ్రీలంక పేసర్ పతిరణపై కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 18 కోట్లు ఖర్చు చేసింది. డెల్హీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్‌తో పోటీ తర్వాత KKR అతన్ని దక్కించుకుంది.

ఎక్కువమంది చదివినది: టీమండియా కెప్టెన్‌గా సంజూ శాంసన్.. పొట్టి ఫార్మాట్ బాధ్యతలు స్వీకరించేందుకు రెడీ..?

7. సామ్ కరన్ – రూ. 18.50 కోట్లు (PBKS, 2023)

2023 వేలంలో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ రూ. 18.50 కోట్లకు అమ్ముడై అప్పట్లో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.

6. ప్యాట్ కమిన్స్ – రూ. 20.50 కోట్లు (SRH, 2024)

ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 20.50 కోట్లకు కొనుగోలు చేసింది. అతను జట్టుకు కెప్టెన్‌గా నియమితుడై ఫైనల్ వరకు తీసుకెళ్లాడు.

5. వెంకటేష్ అయ్యర్ – రూ. 23.75 కోట్లు (KKR, 2025)

ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్‌ను KKR రూ. 23.75 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే 2025 సీజన్‌లో అతని ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోయింది.

ఎక్కువమంది చదివినది: ఫైనల్ మ్యాచ్‌కు ముందే చెల్లి చనిపోయినా.. దేశం కోసం బరిలోకి ఛోటా ప్యాకెట్..!

4. మిచెల్ స్టార్క్ – రూ. 24.75 కోట్లు (KKR, 2024)

2024 వేలంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ రూ. 24.75 కోట్లకు కొనుగోలు అయ్యి అప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.

3. క్యామెరాన్ గ్రీన్ – రూ. 25.20 కోట్లు (KKR, 2026)

2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ క్యామెరాన్ గ్రీన్ రూ. 25.20 కోట్లకు KKR జట్టులో చేరాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తీవ్ర పోటీ తర్వాత ఈ డీల్ పూర్తైంది.

2. శ్రేయస్ అయ్యర్ – రూ. 26.75 కోట్లు (PBKS, 2025)

పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్‌ను రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. అతని నాయకత్వంతో జట్టు ఫైనల్‌కు చేరడం విశేషం.

1. రిషభ్ పంత్ – రూ. 27.00 కోట్లు (LSG, 2025)

ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్ నిలిచాడు. లక్నో సూపర్ జెయింట్స్ అతన్ని రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది.

ఐపీఎల్ వేలం ప్రాధాన్యం..

ఐపీఎల్ వేలం ప్రతి సంవత్సరం క్రికెట్ ప్రపంచంలో భారీ చర్చకు దారి తీస్తుంది. ఆటగాళ్ల ప్రదర్శన, ఫామ్, మార్కెట్ విలువ ఆధారంగా ఫ్రాంచైజీలు భారీ మొత్తాలు ఖర్చు చేస్తాయి. ఈ రికార్డు ధరలు ఐపీఎల్ లీగ్ ఆర్థిక శక్తిని కూడా చూపిస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *