EV Buying tips: ఈ విషయాలు తెలుసుకోకుండా ఈవీ కొంటే.. ఇబ్బందులు తప్పవు!

EV Buying tips: ఈ విషయాలు తెలుసుకోకుండా ఈవీ కొంటే.. ఇబ్బందులు తప్పవు!


ప్రస్తుతం దేశంలో సుమారు 56 లక్షల ఈవీలు నడుస్తున్నాయని ఒక అంచనా.పెట్రోల్ ఖర్చు కలిసొస్తుందని లేదా నడపడానికి ఈజీగా ఉంటందున్న ఉద్దేశంతో చాలామంది ఈవీలు తీసుకుంటున్నారు. పైగా మార్కెట్లోకూడా రకరకాల ఈవీలు అందుబాటులో ఉన్నాయి. అయితే పెట్రోల్ బండి నుంచి ఎలక్ట్రిక్ బండికి మారేవాళ్లు ఈవీల గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి.  అవేంటంటే..

ఇంజిన్ కాదు మోటర్

పెట్రోల్ బండి వాడకానికి ఈవీల వాడకానికి చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా మీరు గమనించాల్సింది. ఇందులో ఉండేది ఇంజిన్ కాదు, మోటర్. అంటే కరెంట్ తో పనిచేసే మోటర్..  దీని పికప్, బ్రేకింగ్, స్పీడ్ పెట్రోల్ బండికి భిన్నంగా ఉంటాయి. కొనేముందు ఒకసారి టెస్ట్ రైడ్ చేసి మీకు సూట్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటే మంచిది.

రేంజ్ ను బట్టి నడపాలి

ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉండే మరో తేడా.. రేంజ్. ఈవీలు వాడాలనుకునేవాళ్లు అది వేసుకుని  ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లలేరని తెలుసుకోవాలి. ఈవీ ఛార్జింగ్ ను బట్టి ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది అనేది డిసైడ్ అయ్యి ఉంటుంది. మామూలు బైక్ నడిపేటప్పుడు కిలోమీటర్ల గురించిన ఆలోచన ఉండదు. కానీ ఈవీ విషయంలో అలా కాదు,  ఎప్పటికప్పుడు రేంజ్ ను గమనిస్తూ నడపాల్సి ఉంటుంది. దీనికి అలవాటు అవ్వడానికి కొంత సమయం పడుతుంది.

చెప్పినంత రేంజ్ రాదు

ఈవీల రేంజ్ విషయంలో గుర్తుంచుకోవాల్సిన మరో విషయం కంపెనీ చెప్పిన రేంజ్.. రియల్ లైఫ్ లో రాదు. కంపెనీ ఫుల్ ఛార్జ్ కు 120 కిలోమీటర్లు అని చెప్తే.. అందులో సగం అంటే సుమారు 60 నుంచి 70 మాత్రమే రియల్ రేంజ్ అని గుర్తుంచుకోవాలి. ఇది కూడా మీరు వెళ్లే స్పీడ్ రోడ్ కండిషన్ ను బట్టి మారుతుంటుంది.

బ్యాటరీ ముఖ్యం

ఇకపోతే ఈవీలో ఉండే బ్యాటరీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దాని వ్యారెంటీని ఎప్పటికప్పుడు రిన్యువల్ చేయిస్తూ ఉండాలి. లేకపోతే బ్యాటరీ మార్చుకోడానకి 60 నుంచి 80 వేల వరకూ అవుతుంది.

దూరాలు వెళ్లలేరు

ఈవీలు వాడేవాళ్లు దూరాలు వెళ్లాలంటే మధ్యలో ఛార్జింగ్‌ పెట్టుకునేందుకు వీలుందేమో చూసుకోవాలి. ఈవీ ఛార్జ్ అయిపోయి మధ్యలో ఆగిపోతే తోసుకెళ్లడం తప్ప మరో దారి ఉండదు. కాబట్టి ఛార్జింగ్ స్టేషన్స్ ను చుసుకుని లాంగ్  జర్నీస్ ప్లాన్ చేసుకోవాలి.

మెయింటెనెన్స్ ఇలా..

ఇకపోతే ఈవీల మెయింటెనెన్స్ డిఫరెంట్ గా ఉంటుంది. దీని సర్వీస్ కాస్ట్ ఎక్కువ. అలాగే బ్యాటరీ ఎప్పుడూ పూర్తిగా జీరో కాకుండా చూసుకోవాలి. ఎండకు వానకు దూరంగా ఉంచాలి. అలాగే ఇవి రిపేర్ వస్తే.. ఎక్కడపడితే అక్కడ చేయించే వీలుండదు. సర్టిఫైడ్ టెక్నీషియన్ దగ్గరకే వెళ్లాలి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *