Headlines

EPFO: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ సింపుల్ పని చేయకపోతే ఇబ్బందుల్లో పడతారు.. నిమిషంలో చేసేయండి..

EPFO: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ సింపుల్ పని చేయకపోతే ఇబ్బందుల్లో పడతారు.. నిమిషంలో చేసేయండి..


EPFO: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ సింపుల్ పని చేయకపోతే ఇబ్బందుల్లో పడతారు.. నిమిషంలో చేసేయండి..

దేశంలోని దాదాపు ప్రైవేట్ ఉద్యోగులందరూ పీఎఫ్ అకౌంట్ కలిగి ఉంటారు. పీఎఫ్ అకౌంట్‌ను యాక్సెస్ చేయాలందే ముందుగా మీ యూఎఎన్ నెంబర్‌ను యాక్టివేట్ చేసుకోవాలి. ఆ తర్వాత యూఎఎన్‌తో మీ ఆధార్ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ పని చేయకపోతే ఈపీఎఫ్ అకౌంట్ ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి బదిలీ చేసుకునే సమయంలో ఆలస్యం, విత్ డ్రా సమయంలో జాప్యం, అలాగే ఇతర పనుల సమయంలో అవాంతరాలు ఎదురుకావొచ్చు. అదే ఆధార్‌ను లింక్ చేసుకోవడం వల్ల మీరు సులభంగా సేవలు పొందవచ్చు. మీ ఇంటి వద్ద నుంచే యూఎఎన్ నెంబర్‌తో సులువుగా ఆధార్ లింక్ చేసుకోవచ్చు. అదెలానో ఇప్పుడు చూద్దాం.

ముందు ఇవి చెక్ చేసుకోండి

మీరు యూఎఎన్ నెంబర్‌తో ఆధార్‌ను లింక్ చేసుకునే ముందు ఇవి ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే.. మీ ఈపీఎఫ్‌వో ప్రొఫైల్‌లోని పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు, ఆధార్ కార్డులోని వివరాలు ఒకేలా ఉన్నాయా.. లేదా అనేది చెక్ చేసుకోవాలి. పూర్తి పేర్లకు బదులు ఇనీషియల్స్ ఉపయోగించకూడదు. పేర్ల మధ్య ఖాళీలు ఉన్నా ధృవీకరణ ఆలస్యమవుతుంది. అలాగే లింక్ చేసుకోవడానికి ముందే మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ యాక్టివ్‌గా ఉంచుకోండి.

లింక్ ఎలా చేసుకోవాలంటే..?

-ఈపీఎఫ్‌వో పోర్టల్‌లోకి వెళ్లండి
-మీ యూఎఎన్ నెంబర్, పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి
-ఒకవేళ పాస్‌వర్డ్ మర్చిపోయినట్లయితే.. దానిని రీసెట్ చేసుకోండి
-మెనులో కేవైసీ ఆప్షన్ ఎంచుకుని ఆధార్ ఇప్పటికే లింక్ అయి ఉందో.. లేదో చూసుకోండి
-ఒకవేళ లింక్ అయితే ఉంటే మీరు మళ్లీ ఈ ప్రాసెస్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు
-లేకపోతే కింద ఆధార్ ఆప్షన్‌ను ఎంచుకుని ఆధార్‌లో ఉన్నట్లుగానే మీ పేరు, నెంబర్ ఎంటర్ చేయండి
-ఆ తర్వాత సేవ్ బటన్ క్లిక్ చేయండి
-మీ యజమాని యాక్సెప్ట్ చేస్తే మీరు ధృవీకరణ పూర్తవుతుంది.
-వెంటనే యాక్సెప్ట్ చేయడానికి మీ హెచ్‌ఆర్‌ను సంప్రదించండి

లింక్ ఎప్పుడు రిజెక్ట్ అవుతుంది..?

పేరు తప్పుగా ఉన్నప్పుడు రిజెక్ట్ అవుతుంది. అలాంటి సమయంలో మీరు మీ ఈపీఎఫ్‌వో ప్రొఫైల్ వివరాలను మార్చుకోవాలి. ఆపై ఆధార్‌తో లింక్ చేయడానికి ప్రయత్నించండి. ఇక ఆధార్‌తో లింక్ చేసుకోవడం వల్ల మీరు ఈపీఎఫ్‌వ సేవలన్నీ సులువుగా పొందవచ్చు. పీఎఫ్ విత్ డ్రా చేసుకునే సమయంలో ఎలాంటి ఇబ్బందులు రావు. ఇక ఆధార్ ఓటీపీ ధృవీకరణకు కూడా ఇది సహాయపడుతుంది. అందుకే ప్రతీఒక్క ఈపీఎఫ్ సభ్యుడు లింక్ చేసుకోవాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *