Headlines

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పెద్ద ఊరట.. యూఏఎన్ నెంబర్ లేకపోయినా చిటికెలో పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.. ఎలా అంటే..?

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పెద్ద ఊరట.. యూఏఎన్ నెంబర్ లేకపోయినా చిటికెలో పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.. ఎలా అంటే..?


EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పెద్ద ఊరట.. యూఏఎన్ నెంబర్ లేకపోయినా చిటికెలో పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.. ఎలా అంటే..?

దేశంలోని ప్రైవేట్ సంస్ధల్లో పనిచేసే ఉద్యోగులందరికీ ఈపీఎఫ్‌వో అకౌంట్ తప్పనిసరిగా ఉంటుంది. ఉద్యోగులకు ఆర్ధిక భద్రత, రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ సదుపాయం కల్పించేందుకు కేంద్రం దీనిని ప్రవేశపెట్టింది. ఎప్పటినుంచో ఈపీఎఫ్‌వో స్కీమ్ అనేది అమలవుతోండగా.. 8 కోట్ల మంది ఖాతాదారులు దేశవ్యాప్తంగా ఉన్నారు. దీని ద్వారా ఈపీఎఫ్‌వో బ్యాలెన్స్‌పై వడ్డీ, పెన్షన్, జీవిత బీమా వంటి సౌకర్యాలు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. ఉద్యోగులకు ఆర్ధిక భద్రతను కల్పించేందుకు ఇది ఎంతగానో సహాయపడుతుంది. కేంద్రం ఎప్పటికప్పుడు ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా కొత్త రూల్స్‌ను తీసుకొస్తుంది. త్వరలో ఈపీఎఫ్‌వో 3.0 వెర్షన్‌ను కేంద్రం విడుదల చేయనుంది.

యూఏఎన్ నెంబర్ లేకపోయినా..

పీఎఫ్ అకౌంట్ కలిగి ఉన్న ప్రతీఒక్కరికీ యూఏఎన్ నెంబర్ అనేది ఉంటుంది. దీనిని యూనివర్శల్ అకౌంట్ నెంబర్ అని కూడా పిలుస్తారు. ఇది పర్మినెంట్ నెంబర్. మీరు ఎన్ని కంపెనీలు మారినా ఈ నెంబర్ అనేది మారదు. ఈ ప్రత్యేక నెంబర్ పీఎఫ్ ఖాతాదారుడికి కేటాయిస్తారు. జీవితాంతం పీఎఫ్ సేవలు పొందటంలో ఇది మీకు సహాయపడుతుంది. పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడంతో పాటు ఇతర కేవైసీ వివరాలు మార్చుకోవడం, క్లెయిమ్ పొందటంలో యూఏఎన్ నెంబర్ ఉపయోగపడుతుంది. అయితే యూఏఎన్ నెంబర్ తెలియకపోయినా మీరు పీఎఫ్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చు. ఎంప్లాయిూస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ అవకాశం కల్పిస్తోంది.

మిస్డ్ కాల్ సాయంతో..

యూఏఎన్ నెంబర్ లేకపోయినా మీరు మిస్డ్ కాల్ సాయంతో సెకన్లలోనే పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ పీఎఫ్ అకౌంట్‌తో ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి. లింక్ అయి ఉంటే ఆ నెంబర్ నుంచి 9966044425 ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వండి. అంటే సెకన్లలోనే మీ పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు మొబైల్‌కు టెక్ట్స్ మెస్సేజ్ రూపంలో అందుతాయి. యూఏఎన్ నెంబర్ లేకపోయినా ఈ మార్గంలో మీరు పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు సులువుగా తెలుసుకోవచ్చు. మిరు ఆ నెంబర్‌కు కాల్ చేయగానే ఒక్కసారి రింగ్ అయ్యి ఆటోమేటిక్‌గా డిస్‌కనెక్ట్ అవుతుంది. ఆ తర్వాత బ్యాలెన్స్ వివరాలు మొబైల్ నెంబర్‌కు అందుతాయి. మీ పీఎఫ్ బ్యాలెన్స్ మొత్తం ఎంత..? సభ్యులు ఐడీ, చివరిగా ఎంత జమ అయ్యాయి? లాంటి వివరాలు అన్నీ అందుతాయి. ఈ విధానంలో బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే యూఏఎన్ నెంబర్ అవసరం లేనప్పటికీ.. ఆ నెంబర్ యాక్టివేట్ అయి ఉండాలి. ఒకవేళ యూఏఎన్ నెంబర్ యాక్టివ్‌గా లేకపోతే మీరు బ్యాలెన్స్ మిస్డ్ కాల్ విధానంలో తెలుసుకోలేరు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *