ఉద్యోగులకు శుభవార్త.. జాబ్ మారినప్పుడు పీఎఫ్ బ్యాలెన్స్‌ను ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఇకపై చాలా ఈజీ. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ ప్రక్రియను మరింత సులభంగా మార్చింది. గతంలో ఉద్యోగులు ఒక కంపెనీ నుండి మరో కంపెనీకి మారినప్పుడు.. పీఎఫ్ బ్యాలెన్స్‌ను ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు కేంద్ర కార్మిక శాఖ కొత్త నిబంధనను తీసుకువచ్చింది. దీని ప్రకారం.. పీఎఫ్ ట్రాన్స్ఫర్ కోసం ఉపయోగించే కీలక పత్రమైన అనెక్సర్ K డాక్యుమెంట్‌ను ఉద్యోగులు నేరుగా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అనెక్సర్ K అంటే ఏమిటి?
అనుబంధం K అనేది పీఎఫ్ ట్రాన్స్ఫర్ను ధృవీకరించడానికి ఈపీఎఫ్ఓ జారీ చేసే ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. ఇందులో ఉద్యోగి పూర్తి వివరాలు, పీఎఫ్ బ్యాలెన్స్, వడ్డీ గతంలో పనిచేసిన కంపెనీ వివరాలు, ఉద్యోగంలో చేరిన, విడిచిపెట్టిన తేదీలు వంటి ముఖ్యమైన సమాచారం ఉంటుంది. ఈ డాక్యుమెంట్ లేకుండా పీఎఫ్ ట్రాన్స్ఫర్ జరగదు.
కొత్త సౌలభ్యం వల్ల లాభాలు:
గతంలో ఈ పత్రం కోసం పీఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు మీ మొబైల్ లేదా కంప్యూటర్లో ఒక్క క్లిక్‌తో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ దరఖాస్తు ఏ స్థితిలో ఉందో ఆన్లైన్లో ట్రాక్ చేయవచ్చు. అనవసరమైన జాప్యం లేకుండా పీఎఫ్ బదిలీ వేగంగా పూర్తవుతుంది.
అనుబంధం K’ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
- మీ పీఎఫ్ అకౌంట్‌కి ఆన్లైన్లో లాగిన్ అవ్వండి.
- ‘ఆన్లైన్ సర్వీసెస్ అనే ఆప్షన్‌లోకి వెళ్లండి.
- ‘ట్రాక్ క్లెయిమ్ స్టేటస్’ అనే ఆప్షన్ ఎంచుకోండి.
- ఆ తర్వాత ‘డౌన్లోడ్ అనేక్చర్ K అనే బటన్‌పై క్లిక్ చేస్తే ఫైల్ డౌన్లోడ్ అవుతుంది.
ఈ కొత్త సౌకర్యం వల్ల ఉద్యోగులకు పీఎఫ్ బదిలీ ప్రక్రియ చాలా సులభంగా మారుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..