English-Speaking Village: మన దేశంలో ఈ గ్రామం వెరీ వేరే స్పెషల్.. ప్రతి ఇంట్లో ఒక ఇంగ్లీష్ టీచర్..

English-Speaking Village: మన దేశంలో ఈ గ్రామం వెరీ వేరే స్పెషల్.. ప్రతి ఇంట్లో ఒక ఇంగ్లీష్ టీచర్..


పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లా సోషల్ మీడియాలో చాలా ప్రసిద్ధి చెందింది. దీనికి ప్రధాన కారణం ఆ గ్రామంలో ఇంగ్లీషు భాషకు ఉన్న ఆదరణ. అవును ఈ చిన్న గ్రామంలో వీధుల్లో ఆడుకునే పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడతారు. ఈ గ్రామంలో ఎక్కడ ఎక్కడ చూసినా IELTS (ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్) పరీక్షకు సిద్ధమవుతున్న వారే కనిపిస్తారు. అంతేకాదు దీని కోసం ఇక్కడ చాలా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. ఈ గ్రామంలోని ప్రతి ఇంట్లో ఒక ఇంగ్లీష్ టీచర్ ఉంటారు.

ప్రతి వీధిలోనూ ఇంగ్లీష్ ప్రతిధ్వని

మీరు గ్రామ వీధులలో నడుస్తుంటే.. IELTS ప్రాక్టీస్ చేస్తున్న పిల్లలు, ఆన్‌లైన్ తరగతులకు సిద్ధమవుతున్న ఉపాధ్యాయులు కనిపిస్తూనే ఉంటారు. ఇక్కడ ఇంగ్లీష్ కేవలం ఒక సబ్జెక్టు మాత్రమే కాదు.. కెరీర్, జీవితంలో ఒక ముఖ్యమైన భాగం.

ఇలా ఈ గ్రామంలో ఇంగ్లీషు మాట్లాడడం అనేది ఒక్క రోజులో జరిగిన వింత కాదు.. కాలియాచక్ గ్రామంలోని ప్రతి ఒక్కరూ రాత్రికి రాత్రే ఇంగ్లీషు భాషలో ప్రావీణ్యం సంపాదించలేదు. దశాబ్దాల కృషి, పాఠశాలల కృషి , ప్రజల అంకితభావం కలిపి ఈ గుర్తింపును తీసుకొచ్చాయి. కాలియాచక్ గ్రామంలో ఫైజీ అకాడమీ, తర్బియాత్ పబ్లిక్ వంటి పాఠశాలలు ఉన్నాయి. ఇవి ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందిస్తున్నాయి. చాలా మంది గ్రామస్తులు ఈ పాఠశాలల నుంచి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇంటి ఇంటికి ట్యూటరింగ్ సెంటర్:

ఇక్కడ పాఠశాలలు మాత్రమే కాదు ప్రతి వీధిలో శిక్షణ, బోధనా కేంద్రాలు ఉన్నాయి. కాలియాచక్ ప్రత్యేకత ఏమిటంటే ఈ గ్రామంలోని టీచర్స్ తమ గ్రామానికి లేదా పట్టణానికి మాత్రమే పరిమితం కాలేదు. ఢిల్లీ, ముంబై , బెంగళూరు వంటి నగరాల్లో కూడా వందలాది మంది టీచర్స్ పాఠాలను బోధిస్తారు. మరోవైపు చాలామంది ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విదేశాలలో పిల్లలకు ఇంగ్లీష్ బోధిస్తున్నారు. వీరి కుటుంబాలు తరువాతి తరం ఇంగ్లీష్ బోధించడంలో రాణించేలా గ్రామంలో చిన్న కోచింగ్ సెంటర్‌లను నిర్వహిస్తున్నాయి.

రోజువారీ జీవితంలో ఇంగ్లీష్

ఈ గ్రామంలో మరో ప్రత్యేక లక్షణం ఏమిటంటే పిల్లలు ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడేలా ప్రోత్సస్తారు. పండుగలు, ఉత్సవాలలో ఇంగ్లీష్ లో డిబేట్ పోటీలు జరుగుతాయి. ఈ గ్రామం విద్యా కేంద్రంగా మాత్రమే కాదు మామిడి, లిచీలను కూడా పండిస్తుంది. పట్టు , జనపనార వ్యాపారం చేస్తుంది. అయితే విద్య ముఖ్యంగా ఇంగ్లీష్ బోధన ఈ గ్రామం ముఖ చిత్రాన్ని మార్చివేసింది. ఈ గ్రామంలో శిక్షణ సంస్థలు దూర ప్రాంతాల స్టూడెంట్స్ ను ఆకర్షిస్తున్నాయి.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *