Elon Musk: X యూజర్లకు భారీ షాక్‌.. ఇప్పుడు ‘గ్రోక్’ (Grok)ను అలా వాడలేరు!

Elon Musk: X యూజర్లకు భారీ షాక్‌.. ఇప్పుడు ‘గ్రోక్’ (Grok)ను అలా వాడలేరు!


Elon Musk: X యూజర్లకు భారీ షాక్‌.. ఇప్పుడు ‘గ్రోక్’ (Grok)ను అలా వాడలేరు!

Elon Musk Grok: ప్రపంచ కుభేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ గురించి పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. అందరికి తెలిసిందే. కాగా ఎక్స్ ఏఐ చాట్ బాట్ గా గ్రోక్ పేరు తెచ్చుకుంది. కానీ ఇప్పుడు అనూహ్యంగా X (Twitter)లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. X (ట్విట్టర్) తన AI చాట్‌బాట్ ‘గ్రోక్’ (Grok) సేవలను ఇకపై ఉచిత వినియోగదారులకు నిలిపివేసింది. ప్రీమియం, ప్రీమియం+ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారికి మాత్రమే గ్రోక్‌ను ప్రశ్నలు అడిగే ఫీచర్ పరిమితం చేసింది. దీనితో ఫ్రీ యూజర్లకు ఆ అవకాశం ఉండదు. ఎలోన్ మస్క్ యాజమాన్యంలోని ఈ ప్లాట్‌ఫారమ్ ఈ మార్పులను తక్షణమే అమలు చేసింది.

ఇది కూడా చదవండి: Petrol, Diesel Prices: భారత్‌లో పెట్రోల్‌, డీజిల్‌ కొత్త ధరలు.. హైదరాబాద్‌లో లీటర్‌కు ఎంత?

సబ్‌స్క్రిప్షన్ వివరాలు: ప్రీమియం కోసం నెలకు రూ. 230, ప్రీమియం+ కోసం నెలకు రూ.1,285 చెల్లించాల్సి ఉంటుంది.

పరిమితులు: గతంలో ఉచిత యూజర్లు కూడా గ్రోక్‌తో సంభాషించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అది పెయిడ్ ఫీచర్‌గా మారింది.

దుర్వినియోగాన్ని అరికట్టేందుకు: అధిక డిమాండ్, కంప్యూట్ ఖర్చులను నిర్వహించడానికి అలాగే గ్రోక్ ఇమేజ్ జనరేషన్ దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

గ్రోక్ 720p వీడియో జనరేషన్, ఇతర అధునాతన సామర్థ్యాలు కూడా ఇప్పుడు కేవలం చెల్లింపు సబ్‌స్క్రైబర్లకు మాత్రమే పరిమితం చేసింది.

సబ్‌స్క్రిప్షన్ చేయడానికి కారణం ఏంటి?

సబ్‌స్క్రిప్షన్ సేవలను పెంచడం, ఆదాయాన్ని పెంపొందించడం వంటి వ్యాపార లక్ష్యాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టెక్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే X ప్లాట్‌ఫామ్‌లో పలు ఫీచర్లు ప్రీమియం యూజర్లకే అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే. అందులో ఎడిట్ పోస్టులు, తక్కువ ప్రకటనలు, పెద్ద వీడియోలు అప్‌లోడ్ చేసే అవకాశం వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు గ్రోక్‌ను కూడా అదే జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Induction Stove: ఎఫెక్ట్‌ మామూలుగా లేదుగా.. దేశవ్యాప్తంగా ఇండక్షన్ స్టవ్‌లను ఎగబడి కొంటున్న జనాలు

గ్రోక్ అంటే ఏమిటి?

గ్రోక్ అనేది xAI అభివృద్ధి చేసిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్. ఇది సోషల్ మీడియాలో కనిపించే పోస్టులు, ట్రెండింగ్ అంశాలు, వార్తలపై వినియోగదారులకు తక్షణ సమాచారం ఇవ్వడానికి రూపొందించారు. ఏ ప్రశ్న అడిగినా క్షణాల్లోనే పూర్తి వివరాలతో అందిస్తుంది.

Grok

Grok

ఇది కూడా చదవండి: Bank Notes: 10, 20, 50 రూపాయల నోట్లపై కేంద్రం కీలక ప్రకటన



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *