Eggshell Benefits: కోడిగుడ్డు పెంకులతో ఇన్ని లాభాలా? తెలిస్తే అస్సలు పడేయరు!

Eggshell Benefits: కోడిగుడ్డు పెంకులతో ఇన్ని లాభాలా? తెలిస్తే అస్సలు పడేయరు!


Eggshell Benefits: కోడిగుడ్డు పెంకులతో ఇన్ని లాభాలా? తెలిస్తే అస్సలు పడేయరు!

ఆకుకూరలు, పండ్లు, పండ్ల రసాలు, డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ వంటివి సూక్ష్మ పోషకాలకు ఎలాగైతే మన ఆరోగ్యానికి ప్రయోజనాలను అందిస్తాయో.. కోడిగుడ్డు పెంకుల కూడా అలానే అందిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవును కోడిగుడ్డు లోపలి పదార్థం కంటే పెంకులలో 27 రకాల ఖనిజాలు అధికంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఫార్మాస్యూటికల్ క్యాల్షియం టాబ్లెట్లలో ఉండే లైమ్‌స్టోన్ లేదా డోలమైట్ కంటే, శుభ్రం చేసి, ఎండబెట్టి పొడి చేసిన కోడిగుడ్డు పెంకులో శరీరానికి అవసరమైన క్యాల్షియం ఉంటుందంటున్నారు. ఈ శుభ్రం చేసిన పొడిని 1/4 టీస్పూన్ చొప్పున ఫ్రూట్ జ్యూస్‌లో లేదా సాంబార్‌లో కలుపుకొని రోజుకు ఒకటి నుండి మూడు సార్లు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన క్యాల్షియం అందుతుందని ఆయన సూచించారు.

కోడి గుడ్డు పొట్టు వల్ల కలిగే ప్రయోజనాలు

కాల్షియం సప్లిమెంట్‌: చాలా మంది కోడి గుడ్డు పెంకులను మంచివి కాదని పాడేస్తూ ఉంటారు. కానీ దీనిని ఎండబెట్టి శుభ్రం చేసి, పొడిగా చేసి ఉపయోగించడం వల్ల ఇది కాల్షియం సప్లిమెంట్‌గా పనిచేస్తుందని చాలా మందికి తెలియదు. నిపుణుల ప్రకారం కేవలం సగం గుడ్డు పెంకు పొడి ఒక యువకుడికి శరీరానికి అవసరమైన 1,000 mg రోజువారీ కాల్షియం లభిస్తుంది.

ఎముకల బలం: కోడిగుడ్డు పెంకులో ఉండే పోషాలు ఆస్టియోపోరోసిస్, వంటి సమస్యలను తగ్గించి, ఎముకల సాంద్రతను పెంచడానికి ఎంతగానో సహాయపడుతాయట.

పళ్ల సంరక్షణ: కోడిగుడ్డు పెంకులు మన పంటి ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతాయట. దీనిలోని ఉండే ఖనిజాలు దంతాల ఎనామెల్‌ను బలోపేతం చేయడంలో ఎంతో అద్భుతంగా పనిచేస్తాయట.

మొక్కలు ,వ్యవసాయానికి: గుడ్డు పెంకులలో కాల్షియంతో పాటు మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిని పొడి చేసి మొక్కల మొదళ్లలో వేయడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా త్వరగా పెరుగుతాయి. అలాగే ఇవి నేలలోని ఆమ్ల గుణాన్ని తగ్గించి, మట్టిలో సారాన్ని పెంచుతాయి, పెంకుల పొడిని మొక్కల చుట్టూ చల్లడం ద్వారా నత్తలు, ఇతర కీటకాలు మొక్కల దగ్గరికి రాకుండా చేస్తాయి.

జాగ్రత్తలు:

ప్రయోజనాలు ఉన్నాయి కదా అని పెంకులను ఎలా పడితే అలా ఉపయోగించడం ప్రమాదం. పెంకులను నేరుగా ఉపయోగించకుండా వాటిపై ఉండే సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియాను తొలగించడానికి వాటిని కనీసం 10 నిమిషాల పాటు బాగా ఉడకబెట్టి, ఆ తర్వాత ఎండబెట్టి పొడి చేసుకోవాలి. అప్పుడే వీటిని ఉపయోగించాలి. ఒక వేళ మీరు దీనిని ఆహారంలో సప్లిమెంట్‌గా తీసుకుంటే కచ్చితంగా ముందు వైద్యులను సంప్రదించండి.

(గమనిక: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి..వీటిని టీవీ9 దృవీకరించట్లేదు. వీటిపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *