దేశంలోని అతిపెద్ద న్యూస్ నెట్వర్క్ TV9 MD and CEO బరున్ దాస్ హోస్ట్ చేస్తోన్న ‘Duologue with Barun Das’ టాక్ షోకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే ఈ షో రెండో ఎడిషన్‌లో నటి రిధి డోగ్రా పాల్గొన్నారు. స్వీయ-ఆవిష్కరణ, కళాత్మక ధైర్యం వంటి అంశాల గురించి రిధి మాట్లాడారు. డెస్టినీ తనను నటిగా ఎలా మార్చిందనే విషయాన్ని రిధి వెల్లడించారు. కార్పొరేట్ టెలివిజన్, ప్రకటనల నుంచి తన ప్రయానాన్ని వివరించారు.
ఈ పాడ్‌కాస్ట్‌లో విరామం లేని ఆకాంక్ష, కచ్చితమైన ప్రణాళిక, పరిపూర్ణత కోసం తపన ద్వారా తన సొంత కెరీర్‌ను ఎలా నిర్మించుకోవచ్చు అనే అంశాలను తెలుసుకోవచ్చు. డ్యూయలాగ్ గురించి రిధి అనుభవాన్ని పంచుకుంటూ.. “ఇది ఒక అద్భుతమైన సంభాషణ. నిజానికి నేను చెప్పిన విషయాల గురించి మాట్లాడాలని నేను ముందు ఊహించలేదు. మనం చాలా పనికిమాలిన విషయాల గురించి మాట్లాడుకుంటామని అనుకున్నాను. కానీ చాలా విలువైన విషయాలు చర్చించుకున్నాం. నన్ను ఈ షోకి పిలిచినందుకు న్యూస్ 9, బరున్ దాస్‌లకు నా ధన్యవాదాలు.” అంటూ రిధి పేర్కొన్నారు.
ఈ డ్యూయోలాగ్ NXT ఎపిసోడ్ టాక్ షో కంటే ఎక్కువ. ఇది తత్వశాస్త్రాల ఆలోచనాత్మక ద్వంద్వ పోరాటం. రిధి డోగ్రా పాల్గొన్న డ్యూయోలాగ్ NXT పూర్తి ఎపిసోడ్‌ను న్యూస్ 9లో సెప్టెంబర్ 29న రాత్రి 10:30 గంటలకు చూడొచ్చు. డ్యూయోలాగ్ యూట్యూబ్ ఛానెల్ (@Duologuewithbarundas), న్యూస్ 9 ప్లస్ యాప్‌లో కూడా ప్రసారం అవుతుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..