Dulquer Salman: ఓటీటీలోకి బాక్సాఫీస్ సంచలనం కొత్త లోక.. స్పందించిన దుల్కర్ సల్మాన్.. ఏమన్నారంటే..

Dulquer Salman: ఓటీటీలోకి బాక్సాఫీస్ సంచలనం కొత్త లోక.. స్పందించిన దుల్కర్ సల్మాన్.. ఏమన్నారంటే..


సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో దుల్కర్ సల్మాన్ ఒకరు. మమ్ముట్టి తనయుడిగా సినీరంగంలో అడుగుపెట్టిన ఈ హీరో.. ఇప్పుడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగు, మలయాళం భాషలలో వరుస హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు నిర్మాతగానూ సక్సెస్ అయ్యారు. ఆయన నిర్మించిన లేటేస్ట్ మూవీ లోక చాప్టర్ 1 ; చంద్ర. ఒక ఉమెన్ సూపర్ హీరో కథ ఆధారంగా విడుదలైన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటించింది. ఇందులో నజ్లానే, టోవినో థామస్, డాన్స్ మాస్టర్ శాండీ, విజయరాఘవన్, సంధు సలీంకుమార్, రఘునంద పలేరి, శివాజిత్ పద్మనాభన్, జైన్ ఆండ్రూస్ కీలకపాత్రలు పోషించారు. అలాగే ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, టోవినో థామస్, షౌబిన్ అతిథి పాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి : Tollywood : 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోతో పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..

ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. డొమినిక్ అరుణ్‌తో కలిసి సంధ్యా బాలచంద్రన్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాశారు. ఈ చిత్రాన్ని 5 భాగాలుగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. రూ.30 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం రూ.250 కోట్లకు పైగా వసూలు చేసి మలయాళ సినిమాల్లో కొత్త రికార్డు సృష్టించింది. ఈ చిత్రం ఆగస్టు 28, 2025న థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ పై స్పందించారు దుల్కర్ సల్మాన్.

ఇవి కూడా చదవండి : Cinema: కాంతార, కేజీఎఫ్ చిత్రాలను వెనక్కు నెట్టింది.. అప్పుడు థియేటర్లు.. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోన్న మూవీ..

“లోక సినిమా త్వరలోనే ఓటీటీలోకి రావడం లేదు. రూమర్స్ నమ్మకండి. కేవలం అధికారికంగా వచ్చే ప్రకటనల కోసమే ఎదురుచూడండి. ” అంటూ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *