Dulquer Salmaan Net Worth: అప్పుడు దుబాయ్‌లో ఐటీ ప్రొఫెషనల్.. ఇప్పుడు తోపు హీరో.. దుల్కర్ సల్మాన్ ఆస్తులు తెలిస్తే పిచ్చెక్కిపోద్ది..

Dulquer Salmaan Net Worth: అప్పుడు దుబాయ్‌లో ఐటీ ప్రొఫెషనల్.. ఇప్పుడు తోపు హీరో.. దుల్కర్ సల్మాన్ ఆస్తులు తెలిస్తే పిచ్చెక్కిపోద్ది..


దుల్కర్ సల్మాన్ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా తెరంగేట్రం చేసి.. ఇప్పుడు స్టార్ హీరోగా మారాడు. హీరోగా తనదైన శైలీలో రాణిస్తున్నాడు. మలయాళంలో అనేక హిట్ చిత్రాల్లో నటించిన ఆయన.. మహానటి సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఈ మూవీతో సౌత్ ఇండస్ట్రీలో పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించిన ఆయన.. చివరగా లక్కీ భాస్కర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. మలయాళం, తమిళం, తెలుగు భాషలలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆకాశంలో ఒక తారా, ఐయామ్ గేమ్, లోకా సీక్వెల్స్ చేస్తున్నారు. అయితే సినిమాల్లోకి రాకముందు ఆయన ఐటీ ప్రొఫెషనల్ గా పనిచేశాడు. ఆ తర్వాత నటనపై ఆసక్తితో సినిమాల్లోకి అడుగుపెట్టారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : అమీర్ పేట్ మెట్రో పక్కన ఉన్న సారథి స్టూడియో మాదే.. కానీ.. టాలీవుడ్ నటుడు..

మలయాళ చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం పొందే ప్రముఖ నటులలో ఒకరిగా ఎదిగారు. కథలను ఎంచుకోవడంలో దుల్కర్ సల్మాన్ చూపించే సంయమనం, పాత్రలలో ఆయన ప్రదర్శించే వైవిధ్యం అతన్ని పాన్-ఇండియా స్టార్‌గా మార్చాయి. దుల్కర్ సల్మాన్ సినిమాల్లో స్టార్ నటుడు మాత్రమే కాదు, విజయవంతమైన చిత్ర నిర్మాత, తెలివైన వ్యాపారవేత్త కూడా. అతను తన సొంత భారీ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఒక్క సినిమా కోసం దాదాపు రూ.10 కోట్లకుపైగానే పారితోషికం తీసుకుంటారు. అలాగే యాడ్స్, ఓటీటీ ఒప్పందాల ద్వారా సంవత్సరానికి రూ.10 కోట్ల వరకు సంపాదిస్తారని సమాచారం. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ రూ.57 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రామ్ చరణ్‏ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని.. అప్పుడే ప్రభాస్‏కు చెప్పా.. టాలీవుడ్ నటుడు..

దుల్కర్ సల్మాన్ సొంతంగా వేఫేరర్ ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ బ్యానర్ పై ‘సెల్యూట్’, ‘వాల్ము’, ‘కింగ్ ఆఫ్ గోటా’, లోకా చాప్టర్ 1 చంద్ర వంటి చిత్రాలను నిర్మించారు. లోకా చిత్రం దాదాపు రూ.30 కోట్లతో నిర్మిస్తే రూ.300 కోట్లకు పైగానే వసూల్లు రాబట్టింది. దుల్కర్ సల్మాన్ రియల్ ఎస్టేట్ రంగంలో అత్యధిక పెట్టుబడులు పెట్టాడు. వాటిలో కొచ్చిలో రూ.100 కోట్ల విలువైన ఇల్లు, దుబాయ్ లో రూ.14 కోట్ల విలువైన పెంట్ హౌస్ ఉన్నాయి. దుల్కర్ సల్మాన్ కు ఆటోమొబైల్స్ అంటే చాలా ఇష్టం. అతనికి కోట్ల విలువైన లగ్జరీ కార్లు ఉన్నాయి. దుల్కర్ కార్ల కలెక్షన్‌లో ఫెరారీ 458 స్పైడర్, పోర్స్చే 911 కారెరా ఎస్, మెర్సిడెస్-బెంజ్ AMG G63, BMW i8, రేంజ్ రోవర్ వోగ్ ఉన్నాయి.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదేం సినిమా రా బాబూ.. నరాలు తెగిపోయే సస్పెన్స్, ట్విస్టులు. ఓటీటీలో దుమ్మురేపుతుంది..

ఎక్కువమంది చదివినవి : Nagarjuna : హలో బ్రదర్ సినిమాలో నాగార్జునకు డూప్‏గా నటించింది ఆ స్టార్ హీరోనా.. ? అస్సలు ఊహించలేదుగా.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *