Headlines

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ సాగులో రైతు వినూత్న ప్రయోగం !!

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ సాగులో రైతు వినూత్న ప్రయోగం !!


సాధారణంగా పంటలు సూర్యరశ్మితో పెరుగుతాయని మనకు తెలుసు. కానీ, ఒక రైతు మాత్రం సూర్యుడితో పనిలేకుండా రాత్రి వేళల్లో విద్యుత్ దీపాల వెలుగులో పంట పండిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నెల్లూరు జిల్లా కలువాయికి చెందిన రైతు పిచ్చిరెడ్డి, అనంతసాగరం మండలం గోవిందపల్లిలో చేస్తున్న ఈ ‘లైటింగ్’ వ్యవసాయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. డ్రాగన్ ఫ్రూట్ సాధారణంగా నవంబర్ నాటికి కోతకు వస్తుంది. అయితే, ఆ సమయంలో అందరి రైతుల పంట ఒకేసారి మార్కెట్‌లోకి రావడంతో ధర పడిపోతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు పిచ్చిరెడ్డి ఒక ఉపాయం ఆలోచించారు. ఉద్యానవన శాస్త్రవేత్తల సలహా మేరకు, మొక్కలకు సూర్యకాంతి తక్కువగా ఉండే శీతాకాలంలో అక్టోబర్ నుండి రాత్రి వేళల్లో కృత్రిమ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. దీనివల్ల మొక్కలు నిరంతరం సూర్యకాంతి అందుతున్నట్లుగా భావించి, ఫిబ్రవరి, మార్చి మాసాల్లోనే కాపుకు వస్తున్నాయి. అన్ సీజన్‌లో మార్కెట్‌లో డ్రాగన్ ఫ్రూట్ కొరత ఉంటుంది కాబట్టి, మంచి గిట్టుబాటు ధర లభిస్తుందని రైతు పిచ్చిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. 70 శాతం సేంద్రీయ పద్ధతిలోనే సాగు చేస్తూ, నీటి వినియోగాన్ని కూడా తగ్గించారు. ఒకసారి పెట్టుబడి పెడితే దీర్ఘకాలం లాభాలు పొందవచ్చని, తోటను చిన్న పిల్లల్లా సంరక్షిస్తే అద్భుత ఫలితాలు ఉంటాయని ఆయన నిరూపిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పంట పొలంలో ఉన్నట్టుండి ఏర్పడిన 20 అడుగుల భారీ గొయ్యి.. దగ్గరకు వెళ్లి చూడగా

Viral Video: రివర్స్ గేర్.. పామునే నోటకరిచిన కప్ప !! ప్రకృతి వైపరీత్యం

Walking: భోజనం చేసిన వెంటనే నడవడం మంచిదా.. కాదా..?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *