Dil Raju: హీరోయిన్‏కు కళ్లు లేవని ఎవరు కొనలేదు.. నేను తీసుకుని రిలీజ్ చేశా.. ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. దిల్ రాజు..

Dil Raju: హీరోయిన్‏కు కళ్లు లేవని ఎవరు కొనలేదు.. నేను తీసుకుని రిలీజ్ చేశా.. ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. దిల్ రాజు..


Dil Raju: హీరోయిన్‏కు కళ్లు లేవని ఎవరు కొనలేదు.. నేను తీసుకుని రిలీజ్ చేశా.. ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. దిల్ రాజు..

తెలుగు సినీ ప్రపంచంలో విజయవంతమైన నిర్మాతలలో నిర్మాత దిల్ రాజు ఒకరు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. అయితే తన జీవితంలో ఒక సినిమా ఎంతటి మలుపు తిప్పిందో పంచుకున్నారు. నిబద్ధత, నిజాయితీ వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆయన తెలిపారు. దిల్ రాజు తన కెరీర్ ప్రారంభంలో అరుంధతి (సౌందర్య, కాంతి కుమార్ దర్శకత్వంలో వచ్చిన మూవీ) చిత్రాన్ని 36 లక్షలకు పంపిణీ హక్కులు కొనుగోలు చేశానని.. అయితే, రిలీజ్ రోజున కేవలం 34 లక్షలు చెల్లించి, మిగిలిన 2 లక్షలు చెల్లించలేకపోయినట్లు గుర్తుచేసుకున్నారు. సినిమా విడుదలయ్యాక భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ప్రింట్, పబ్లిసిటీ ఖర్చులతో సహా మొత్తం పెట్టుబడి పోయిందని తెలిపారు.

భారీ నష్టాల్లో ఉన్నప్పటికీ నాలుగో లేదా ఐదో రోజున కాస్ట్యూమ్ కృష్ణకి ఫోన్ చేసి, మిగిలిన 2 లక్షల బ్యాలెన్స్‌ను చెల్లించినట్లు తెలిపారు. సాధారణంగా సినీ పరిశ్రమలో ఇలాంటి నష్టాల తర్వాత డిస్ట్రిబ్యూటర్లు తమ బకాయిలను వదిలేస్తుంటారు. కానీ దిల్ రాజు చూపిన నిజాయితీ కాస్ట్యూమ్ కృష్ణని ఎంతగానో ఆకట్టుకుంది. ఆయన నిబద్ధతను మెచ్చుకుంటూ, కాస్ట్యూమ్ కృష్ణ తన తదుపరి చిత్రం పెళ్లి పందిరి పంపిణీ హక్కులను దిల్ రాజుకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇది కన్నడ చిత్రం అనురాగ సంగమంకు రీమేక్.

పెళ్లి పందిరి చిత్రం అవకాశం వచ్చినప్పుడు, దిల్ రాజు చెన్నై వెళ్లి అనురాగ సంగమం వీహెచ్‌ఎస్ చూశానని.. సినిమా బాగా నచ్చడంతో, అది కచ్చితంగా విజయం సాధిస్తుందని బలంగా నమ్మినట్లు తెలిపారు. అప్పుడే ఆర్థిక సమస్యలు రావడంతో హైదరాబాద్‌కి తిరిగి వచ్చి తన సోదరులు శిరీష్, లక్ష్మణ్, పెద్దన్నయ్యతో విషయాన్ని పంచుకోగా, గతంలో ఎదురైన నష్టాల కారణంగా సినిమా చేయవద్దని చెప్పారట. కానీ దిల్ రాజు సినిమాపై తనకున్న నమ్మకంతో వారిని ఒప్పించానని.. ఇది నా చివరి ప్రయత్నం అంటూ, గతంలో కేవలం నిర్మాతలు, దర్శకుల ట్రాక్ రికార్డ్ చూసి సినిమాలు కొన్నానని, కానీ ఈ సినిమా తాను చూసి, ఆడగలదని నమ్మినట్లు తెలిపారు.

కాస్ట్యూమ్ కృష్ణ పెళ్లి పందిరి కోసం 60 లక్షలు అడిగారని.. డబ్బులు లేకపోయినా ఒప్పందం చేసుకున్నానని అన్నారు దిల్ రాజు. తొలి విడత 6 లక్షలు.. తన షాప్‌లోని డబ్బు, స్నేహితుల నుంచి తీసుకున్న సహాయంతో 3 లక్షలు చెల్లించానని అన్నారు. ఒక వారం తర్వాత మరో 3 లక్షలు సమకూర్చి, తొలి విడత మొత్తం 6 లక్షలు చెల్లించారు. తర్వాత మిగిలిన 24 లక్షలు సమకూర్చడానికి దిల్ రాజు ఎంతో మందిని సంప్రదించారు. అయితే, గతంలో ఆయనకు ఉన్న ఫ్లాప్ డిస్ట్రిబ్యూటర్‌గా బ్రాండ్ కారణంగా ఎవరూ పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాలేదని గుర్తు చేసుకున్నారు.. ఈ విషయం లెజెండరీ నిర్మాత ఎంఎస్ రెడ్డికి తెలిసి.. సత్యనారాయణ అనే మధ్యవర్తి ద్వారా ఎంఎస్ రెడ్డి గారు దిల్ రాజును సంప్రదించారని అన్నారు. ఎంఎస్ రెడ్డి లాంటి వ్యక్తి తనతో భాగస్వామ్యం కోసం అడగడం తనకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించిందని… శబ్దాలయ స్టూడియోలో ఎంఎస్ రెడ్డిని కలిసి తన పరిస్థితిని వివరించానని.. ఎంఎస్ రెడ్డి పెళ్లి పందిరిలో 50% భాగస్వామ్యం తీసుకుంటానని, మిగిలిన 24 లక్షల్లో 12 లక్షలు తాను, 12 లక్షలు తనని చెల్లించాలని చెప్పారని అన్నారు.

తరువాత ఎంఎస్ రెడ్డి తన పేరు మీదుగా ఒప్పందం చేయించారు. ఎంఎస్ రెడ్డి వెంటనే 6 లక్షలు చెల్లించారని. సినిమా విడుదల సమయానికి అనేక సమస్యలు ఎదురయ్యాయిని అన్నారు. నిర్మాతలైన కాస్ట్యూమ్ కృష్ణ, కోడి రామకృష్ణ (ఆయనను రామకృష్ణ అని కూడా పిలిచేవారు) ఆర్థిక సమస్యలతో రిలీజ్‌ను ఆపేశారు. అయితే, ఎంఎస్ రెడ్డి తన పలుకుబడితో, స్వయంగా ప్రింట్‌లను ట్రిమ్ చేయించి, నైజాంలోని సంధ్యా థియేటర్‌లో పెళ్లి పందిరిని విడుదల చేయించారు. సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే, ఆర్థిక సమస్యల కారణంగా కాస్ట్యూమ్ కృష్ణ బృందం కేసులు పెట్టడానికి సిద్ధమైంది. అప్పుడు దిల్ రాజు స్వయంగా కాస్ట్యూమ్ కృష్ణని కలిసి, ఎంఎస్ రెడ్డి తరపున చెల్లించాల్సిన బకాయిలను తాను బాధ్యతగా చెల్లిస్తానని హామీ ఇచ్చారు. నైజాంలో సినిమా కలెక్షన్లను డిస్టర్బ్ చేయవద్దని కోరారు. ఒక రాత్రి కూడా నిద్రపోకుండా, రెండు రోజులు అవిశ్రాంతంగా కష్టపడి, మిగిలిన ఆర్థిక లావాదేవీలను పరిష్కరించారు. సంధ్యా థియేటర్‌లో మొదటిసారి సెకండ్ షో చూసిన తనకు ఆ సినిమా విజయం, అది తన జీవితంలో ఎంతటి మలుపు అనేది స్పష్టంగా అర్థమైంది. పెళ్లి పందిరి లేకుండా తాను లేనని ఆయన అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట భయ్యా.. 29 ఏళ్లుగా ట్రెండింగ్.. మనసును హత్తుకునే సాంగ్.. వింటే వదలరు..

ఎక్కువమంది చదివినవి : Jr.NTR: ఆ విషయం పదే పదే చెప్పడం నాకు నచ్చదు.. ప్రతి ఒక్కరూ పుట్టుకతోనే తెలుసుకోవాలి.. ఎన్టీఆర్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *