Digital Detox: మీ ఫోన్ మిమ్మల్ని పుస్తకాలకు దూరం చేస్తోందా?.. మళ్ళీ చదవడం ప్రారంభించడానికి ఈ 10 ట్రిక్స్ వాడండి!

Digital Detox: మీ ఫోన్ మిమ్మల్ని పుస్తకాలకు దూరం చేస్తోందా?.. మళ్ళీ చదవడం ప్రారంభించడానికి ఈ 10 ట్రిక్స్ వాడండి!


పుస్తక పఠనం అనేది కేవలం సమాచారం కోసం కాదు.. అది మెదడుకు ఒక వ్యాయామం లాంటిది. డిజిటల్ ప్రపంచంలో మన ఏకాగ్రత తగ్గిపోతున్న వేళ, పుస్తకాలు మనల్ని మళ్ళీ గాడిలో పెడతాయి. భారీ నవలలు చూసి భయపడకుండా, చిన్న చిన్న అడుగులతో పఠనాన్ని మళ్ళీ ఎలా ప్రారంభించాలి? ఆడియో బుక్స్ నుండి బెడ్ టైమ్ రీడింగ్ వరకు.. మీ జీవితాన్ని మార్చే 10 సులభమైన సూత్రాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. చిన్న అడుగులతో మొదలుపెట్టండి

నేరుగా 500 పేజీల పుస్తకాన్ని తీసుకోకండి. రోజుకు కేవలం 5 పేజీలు లేదా 10 నిమిషాలు మాత్రమే చదవడం ఒక నియమంగా పెట్టుకోండి. అది క్రమంగా మీ అలవాటుగా మారుతుంది.

2. మీకు నచ్చిన అంశాన్ని ఎంచుకోండి

మొదట్లోనే క్లిష్టమైన విషయాలు కాకుండా, మీకు ఇష్టమైన చిన్న కథలు లేదా స్వీయ అభివృద్ధి (Self-help) పుస్తకాలతో ప్రారంభించండి. అవి మిమ్మల్ని తదుపరి పేజీకి ఆటోమేటిక్‌గా లాగుతాయి.

3. పుస్తకాన్ని ఎప్పుడూ వెంట ఉంచుకోండి

మీరు ఎక్కడికి వెళ్ళినా బ్యాగులో ఒక పుస్తకం ఉండేలా చూసుకోండి. బస్సులో ప్రయాణించేటప్పుడు లేదా ఎవరి కోసమైనా వేచి చూస్తున్నప్పుడు ఫోన్ చూసే బదులు పుస్తకం తెరవండి.

4. ఆడియో బుక్స్ ప్రయత్నించండి

చదవడానికి సమయం లేకపోతే, ప్రయాణాల్లో లేదా పనిలో ఉన్నప్పుడు ఆడియో బుక్స్ వినండి. ఇది మిమ్మల్ని ఆ కథా ప్రపంచానికి దగ్గర చేసి, తిరిగి భౌతిక పుస్తకాలను చదవాలనే ఆసక్తిని కలిగిస్తుంది.

5. డిజిటల్ డిటాక్స్ – బెడ్ టైమ్ రీడింగ్

పడుకునే అరగంట ముందు ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి పుస్తకం చదవండి. దీనివల్ల కళ్ళపై ఒత్తిడి తగ్గడమే కాకుండా, ప్రశాంతమైన నిద్ర పడుతుంది.

6. అనుభవాన్ని పంచుకోండి

మీరు చదివిన మంచి విషయాన్ని మీ స్నేహితులతో చెప్పండి లేదా సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. నలుగురు దాని గురించి అడిగినప్పుడు, మీరు మరింత చదవడానికి ప్రేరణ పొందుతారు.

7. మంచి వాతావరణాన్ని ఎంచుకోండి

ఒకే చోట బోర్ కొడితే బాల్కనీలోనో, పార్కులోనో లేదా నిశ్శబ్ద కేఫ్‌లోనో కూర్చుని చదవండి. ఆ పరిసరాలు మీకు కొత్త ఉత్సాహాన్నిస్తాయి.

8. బుక్ మార్క్స్ వాడండి

పుస్తకం మధ్యలో ఆపేసినప్పుడు పేజీలు మడతపెట్టకండి. అందమైన బుక్ మార్క్స్ వాడండి. అది మీరు మళ్ళీ పుస్తకాన్ని తెరిచినప్పుడు ఒక ఆకర్షణను కలిగిస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *