షుగర్ ని కంట్రోల్ చేయడానికి సహాయపడే ఆహారాల్లో కరివేపాకు ఒకటి. కరివేపాకులో ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి. ఈ సమ్మేళనాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి, చక్కెర స్థాయిని నియంత్రించడానికి సహాయపడతాయి. కరివేపాకు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆరోగ్యకరమైన లిపిడ్ ప్రొఫైల్‌ను నిర్వహించడానికి, గుండె సంబంధిత వ్యాధులను తగ్గించడానికి కరివేపాకు సహాయపడుతుంది. షుగర్ పేషెంట్లు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకు నమలడం వల్ల బరువు తగ్గవచ్చు.
కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల కరివేపాకు ఆకులు నమిలి తినడం వల్ల బాడీ డీటాక్సీ ఫై అవుతుంది. ఇది మొత్తం శరీరానికి చాలా మంచిది. మనం తినే జంక్ ఫుడ్, అన్‌హెల్దీ లైఫ్‌స్టైల్ కారణంగా బాడీలో టాక్సిన్స్ పెరిగిపోతాయి. కరివేపాకు తినడం వల్ల ఆ టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్లిపోతాయి. కరివేపాకులో జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడే యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవన్నీ పొట్టను శుభ్రంగా ఉంచడంలో ఇవి సహాయపడతాయి. అజీర్ణం, గ్యాస్, పొట్ట సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది.
కరివేపాకును ఖాళీ కడుపుతో తింటే చెడు కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. దీంతో గుండె సంబంధిత వ్యాధులను తగ్గించుకోవచ్చు. అంతేకాదు.. కరివేపాకులో విటమిన్ ఎ పుష్కలంగా ఉండటం వల్ల కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని బీటా కెరోటిన్ క్యాటరాక్ట్, ఇతర కంటి సమస్యలను నివారిస్తుంది. అంతేకాదు..కరివేపాకులోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. ఇది వృద్ధాప్యాన్ని నివారించడంతోపాటు.. ముడతలు, ఇతర చర్మ సమస్యలను నయం చేస్తుంది.
ఇవి కూడా చదవండి
( NOTE: పైన పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీరు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.