Dharmendra Pradhan: పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మనందరికీ స్ఫూర్తిదాయకం: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్

Dharmendra Pradhan: పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మనందరికీ స్ఫూర్తిదాయకం: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్


పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా గురువారం పలువురు ప్రముఖులు, కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు ఆయనకు నివాళులర్పించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా, ఇతర నాయకులు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. “భారతీయ ఆలోచనలకు ప్రముఖ స్తంభం అయిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి నేడు. ఆయన మనందరికీ స్ఫూర్తిదాయకం… భారతదేశ విద్య, అభివృద్ధి గురించి ఆయన విస్తృతంగా మాట్లాడారు… ప్రధానమంత్రి మోదీ తన ఆలోచనల ఆధారంగా సంక్షేమ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.. దశాబ్దాల క్రితం ఆయన మాట్లాడిన అదే భారతీయ తత్వశాస్త్రం, ఆయన ఆలోచనలపై మేము పని చేస్తున్నాము…” అంటూ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు.

నాలాంటి లక్షలాది మంది కార్మికులకు మార్గదర్శి అయిన గౌరవనీయులైన పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పార్క్‌లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించాను. సమగ్ర మానవతావాదం – అంత్యోదయ వంటి ప్రగతిశీల ఆలోచనల ద్వారా భారత రాజకీయాలకు కొత్త దిశానిర్దేశం చేయడంలో గౌరవనీయులైన దీన్‌దయాళ్ ఉపాధ్యాయ విశేష కృషి చేశారు. అభివృద్ధి – సంక్షేమం సమాజంలోని చివరి వ్యక్తికి చేరినప్పుడే నిజమైన సామాజిక అభ్యున్నతి సాధ్యమని ఆయన విశ్వసించారు. భారత రాజకీయాలు, సమాజానికి పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ చేసిన కృషి మరువలేనిది.. ఆయన దార్శనికత ఎల్లప్పుడూ బలమైన, సంపన్నమైన, స్వావలంబన గల భారతదేశాన్ని నిర్మించడానికి మనకు స్ఫూర్తినిస్తుంది.. అంటూ.. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *