భారతదేశంలో ప్రతి సంవత్సరం పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఎంతో వైభవంగా జరుపుకునే దీపావళి మరి కొన్ని రోజుల్లో రానుంది. ఈ రోజున లక్ష్మీదేవిని, గణేశుడిని పూజిస్తారు, కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు కోసం ప్రార్ధిస్తారు. అయితే ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున జరుపుకునే ఈ దీపావళి పండగను జరుపుకునే విషయంలో ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఈ రోజు 2025 లో దీపావళి పండగ ఎప్పుడు వచ్చింది? ఖచ్చితమైన తేదీ, శుభ సమయం, పూజా విధానం, ప్రాముఖ్యత.. గురించి తెలుసుకుందాం.
దీపావళి 2025 తేదీ, సమయం
దృక్ పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసం అమావాస్య తిథి అక్టోబర్ 20, 2025న తెల్లవారుజామున 3:44 గంటలకు ప్రారంభమై.. అక్టోబర్ 21, 2025న ఉదయం 5:54 గంటలకు ముగుస్తుంది. కనుక 2025 దీపావళి పండుగ అక్టోబర్ 20 సోమవారం నాడు జరుపుకోవాల్సి ఉంటుంది.
దీపావళి నాడు లక్ష్మీ-గణేష్ పూజ పద్ధతి
దీపావళి రోజున లక్ష్మీదేవిని , గణేశుడిని పూజించే ముందు.. ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసి ప్రవేశ ద్వారం వద్ద ముగ్గు వేయాలి. ప్రధాన ద్వారానికి ఇరువైపులా దీపాలు వెలిగించండి. పూజా స్థలంలో ఎర్రటి వస్త్రంతో వేసి ఆ పీటం మీద లక్ష్మీదేవి, గణేశుడు, కుబేరుడి విగ్రహాలను ప్రతిష్టించండి. తరువాత.. ఒక నీరు ఆచమనం చేసి పూజ ప్రారంభించాలి. తరువాత ముందుగా గణేశుడిని పూజించాలి. ఆయనకు స్నానం చేయించి, బట్టలు, చందనం పేస్ట్, పువ్వులు, దర్భ గడ్డిని సమర్పించండి. దీని తరువాత లక్ష్మీదేవిని పూజించండి. అమ్మవారికి తామర పువ్వులు, సింధూరం, అక్షతలు, పసుపు, సుగంధ ద్రవ్యాలు, స్వీట్లు, పండ్లు సమర్పించండి. ఈ రోజున కొత్త ఖాతా పుస్తకాలు, ఇనప్పెట్టెలు, సంపదను కూడా పూజిస్తారు. పూజ సమయంలో 11, 21, లేదా 51 దీపాలను వెలిగించండి. చివరగా మొత్తం కుటుంబంతో కలిసి లక్ష్మీ-గణేష్ కి హారతి ఇవ్వండి. తర్వాత అందరికీ ప్రసాదం పంపిణీ చేయండి.
దీపావళి నాడు తీసుకోవాల్సిన చర్యలు!
దీపావళి సాయంత్రం తులసి మొక్క దగ్గర తొమ్మిది నెయ్యి దీపాలను వెలిగించండి. ఇది ఇంటి నుంచి ప్రతికూల శక్తిని తొలగిస్తుందని, లక్ష్మీ దేవిని ప్రసన్నం అవుతుందని నమ్ముతారు.
దీపావళి రాత్రి రావి చెట్టు కింద నూనె దీపం వెలిగించి, వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి తిరిగి వెళ్లండి. అలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
దీపావళి పూజ సమయంలో తెలుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదంగా భావిస్తారు.
ఇంట్లో ఏదైనా అప్పు ఉంటే దీపావళి నాడు కొత్త ఆర్థిక ప్రణాళిక వేసుకోవడం శుభప్రదం.
దీపావళి ప్రాముఖ్యత
దీపావళి చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది. సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవిని, జ్ఞానానికి దేవుడైన గణేశుడిని పూజిస్తూ ఈ పండగను జరుపుకుంటారు. ఈ రోజు ఇంటికి ఆనందం, శాంతి, శ్రేయస్సును తీసుకువస్తుందని నమ్మకం. ఈ రోజున లక్ష్మీ దేవిని స్వాగతించడం వల్ల కుటుంబానికి ఆనందం , శ్రేయస్సు వస్తుంది. దీపాలు వెలిగించడం వల్ల చీకటి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. దీపావళి సంబంధాలను బలోపేతం చేయడానికి కూడా ఒక అవకాశం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు