క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ అనేది మీ పాన్ కార్డ్ నెంబర్ ను బేస్ చేసుకుని మీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ప్రకారం మారుతుంటుంది. ఈ స్కోర్ మీరు అప్పు తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఈ స్కోర్ ఎప్పటికప్పుడు మారుతుంటుంది. అయితే ఈ స్కోర్ విషయంలో చాలా విషయాలు కీలక పాత్ర పోషిస్తాయి. అవేంటో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.
రీపెమెంట్
మీరు తీసుకున్న లోన్స్ లేదా క్రెడిట్ కార్డుల పేమెంట్లు సకాలంలో చెల్లిస్తున్నారా? లేదా? అన్నదాన్ని బట్టి క్రెడిట్ స్కోర్ ఆధారపడి ఉంటుంది. లోన్ రీపెమెంట్ అనేది ఈ స్కోర్ లో ముఖ్యమైన విషయం. ఈఎంఐలు లేట్ గా కట్టడం లేదా ఫైన్ లు కట్టడం వంటివి చేస్తే స్కోర్ తగ్గుతుంది. ఒకవేళ లోన్స్ ఎక్కువ కాలంగా పెండింగ్ లో ఉన్న కట్టలేక సెటిల్ మెంట్ చేసుకున్నా.. మీ స్కోర్ పూర్తిగా తగ్గిపోతుంది. ఇలా తగ్గితే ఇంకోసారి మీకు లోన్ వచ్చే అవకాశం ఉండదు. ఒకవేళ హామీ కింద ఇల్లు లేదా ఇతర ఆస్తులు పెట్టి లోన్స్ తీసుకున్నట్టయితే.. మీకు క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.
క్రెడిట్ యుటిలైజేషన్
మీరు వాడుతున్న క్రెడిట్ కార్డుల్లో క్రెడిట్ యుటిలైజేషన్ 30 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే మీ కార్డు లిమిట్ రూ. లక్ష అయితే.. అందులో ప్రతినెలా రూ.30 వేలకు మించి వాడకుండా ఉంటే స్కోర్ పెరుగుతుంది. ఫుల్ లిమిట్ వాడేస్తే.. తగ్గుతూ ఉంటుంది.
క్రెడిట్ హిస్టరీ
మీ ఓవరాల్ స్కోర్ పై మీ పాత క్రెడిట్ హిస్టరీ ప్రభావం 15 శాతం వరకూ ఉంటుంది. మీరు ప్రస్తుతం అన్ని బిల్లులు సకాలంలో చెల్లిస్తున్నా.. గతంలో లేట్ పేమెంట్స్ చేసి ఉంటే దాని వల్ల కూడా కొంత స్కోర్ తగ్గుతుంది.
మల్టిపుల్ లోన్స్
మీరు రకరకాల లోన్స్ తీసుకుని సకాలంలో చెల్లిస్తూ ఉన్నట్లయితే మీ స్కోర్ వేగంగా పెరుగుతుంది. అంటే క్రెడిట్ కార్డు, పర్సనల్ లోన్, హోమ్ లోన్, వెహికల్ లోన్.. ఇలా పలురకాల క్రెడిట్స్ తీసుకుని వాటన్నింటినీ సరిగ్గా కడుతూ ఉంటే మీ స్కోర్ చాలా ఎక్కువగా ఉంటుంది.
పాత క్రెడిట్ కార్డ్స్
మీరు వాడకుండా వదిలేసిన పాత క్రెడిట్ కార్డుల వల్ల మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోవచ్చు. వాటిని డీయాక్టివేట్ అయినా చేయాలి లేదా అప్పుడప్పుడు కొంత వాడుతూ తిరిగి కడుతూ ఉండాలి. లేకపోతే స్కోర్ పై నెగెటివ్ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది.
మల్టిపుల్ అప్లికేషన్స్
ఒకేసారి మల్టిపుల్ లోన్స్ అప్లై చేస్తే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. ఎన్నిసార్లు అప్లికేషన్ రిజెక్ట్ అయితే అంత స్కోర్ తగ్గుతుంది. అలాగే ఒకేరోజులో నాలుగైదు ఫైనాన్స్ కంపెనీలు మీ క్రెడిట్ స్కోర్ ను చెక్ చేసినప్పుడు కూడా మీ స్కోర్ తగ్గే అవకాశం ఉంది.
స్కోర్ రేంజ్ ఇలా..
క్రెడిట్ స్కోర్ అనేది 700 కు పైగా ఉంటే గుడ్ అని అర్థం. 750 కంటే ఎక్కువ ఉంటే అది ఇంకా బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక 800 దాటితే మీ క్రెడిట్ పెర్ఫామెన్స్ చాలా బాగుంది అని అర్థం
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి