Credit Cards: మీ క్రెడిట్ కార్డు ఫ్రెండ్స్‌కు ఇస్తున్నారా? ముందు ఇది తెలుసుకోండి!

Credit Cards: మీ క్రెడిట్ కార్డు ఫ్రెండ్స్‌కు ఇస్తున్నారా? ముందు ఇది తెలుసుకోండి!


షాపింగ్ చేయడానికి లేదా కార్డు మీద ఏదైనా ఆఫర్ ఉందనో.. లేదా ఇతర అవసరాల కోసమో ఫ్రెండ్స్ అడిగారు కదా అని క్రెడిట్ కార్డు ఇస్తుంటారు చాలామంది. ఫ్రెండ్స్ వాడుకోవడం వల్ల పోయేదేముంది? పైగా మన క్రెడిట్ స్కోరే పెరుగుతుంది కదా! అనుకుంటారు. అయితే దీనివల్ల కొన్ని తెలియని రిస్క్ లున్నాయి అవేంటంటే..

స్పెండిగ్ లిమిట్ దాటితే..

క్రెడిట్ కార్డు వినియోగదారుడు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే, బ్యాంకులు ఆ వివరాలను ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులకు అందిస్తాయి. ఒకవేళ మీకు తెలియకుండా మీ కార్డ్ పై స్పెండింగ్ పది లక్షలు దాటితే అది మీకు సమస్యగా మారొచ్చు. కాబట్టి మీరు ఎవరికి ఇచ్చినా.. మీ క్రెడిట్ కార్డు స్పెండింగ్స్ పై ఓ కన్నేసి ఉంచడం మంచిది.

లెక్క చెప్పాల్సి వస్తే..

ఒకవేళ మీరు క్రెడిట్ కార్డు నుంచి ఎక్కువమొత్తంలో డబ్బు తీసి మీ ఫ్రెండ్స్ కు ఇస్తున్నట్టయితే..  అది ఒక ట్రెడిషనల్ ట్రాన్సాక్షన్ కింద పరిగణించబడదు. అంటే ఎప్పుడైనా మీరు ఇన్ కమ్ ట్యాక్స్ వాళ్లకు లెక్క చెప్పాల్సి వస్తే.. ఇలా కార్డు నుంచి తీసి ఫ్రెండ్స్ కు ఇచ్చిన వివరాలను ట్రాన్సాక్షన్ రూపంలో చూపించలేరు. కాబట్టి ఒకవేళ ఫ్రెండ్స్ కు సాయం చేయాల్సి వస్తే.. క్రెడిట్ కార్డు నుంచి కాకుండా నేరుగా మీ సొంత అకౌంట్ నుంచి ఇవ్వడం మంచిది.

కార్డు లిమిట్ వాడేస్తే..

క్రెడిట్ కార్డుని వాడడం ద్వారా క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది అనుకుంటారు చాలామంది. అయితే  మీ కార్డు లిమిట్ ను పూర్తిగా వాడేయడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ తగ్గే ప్రమాదముంది. కాబట్టి ఫ్రెండ్స్ కు ఇచ్చేముందు వాళ్లు ఎంత మేరకు ఖర్చు చేస్తారో తెలుసుకుని ఇవ్వడం మంచిది.

టైంకి ఇవ్వకపోతే..

ఇకపోతే ఏదైనా కారణం చేత మీ స్నేహితులు మీకు సకాలంలో బిల్లు మొత్తం చెల్లించకపొతే.. ఆ ఎఫెక్ట్ మీ క్రెడిట్ స్కోర్ పై పడుతుంది. లేట్ పేమెంట్స్ చేయాల్సి వచ్చినా లేదా బిల్లు ఎగ్గొట్టినా.. అది మీపై అదనపు భారం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి స్నే్హితులకు సాయం చేయాలనుకుంటే క్రెడిట్ కార్డు నుంచి కాకుండా నేరుగా మీ డబ్బు ఇవ్వడం మంచిదనేది నిపుణుల సలహా.

మరిన్ని బిజినెస్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *