Coffee: మీరు కాఫీ తాగినా పడుకుంటారా..? సైన్స్ చెప్పిన వింత నిజం తెలిస్తే అవాక్కే..

Coffee: మీరు కాఫీ తాగినా పడుకుంటారా..? సైన్స్ చెప్పిన వింత నిజం తెలిస్తే అవాక్కే..


మనం చాలామందికి రోజు మొదలవ్వాలంటే ఒక కప్పు వేడి వేడి కాఫీ కావాలి. కానీ కాఫీ తాగిన తర్వాత కొందరికి చాలా యాక్టివ్‌గా అనిపిస్తుంది. ఇంకొందరికి మాత్రం నిద్ర రావడం.. లేదా గుండె దడ వస్తుంది. ఎందుకిలా జరుగుతుంది..? దీనికి కారణం మన శరీర తత్వం ఒక్కటే కాదు మన జన్యువులు కూడా అని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల డాక్టర్ విశాఖ అనే ఈ ఆసక్తికరమైన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

మీ శరీరం కాఫీని ఎలా అరిగించుకుంటుంది?

మన శరీరంలో CYP1A2 అనే ఒక జీన్ ఉంటుంది. ఈ జీన్ మనం తాగిన కాఫీలోని కెఫిన్‌ను ఎంత వేగంగా అరిగించుకుంటుందో నిర్ణయిస్తుంది. ఈ జన్యువు రెండు రకాలుగా పనిచేస్తుంది:

వేగంగా అరిగించుకునేవారు : ఈ రకం జీన్ ఉన్నవారు కాఫీని చాలా త్వరగా అరిగించుకుంటారు. మీరు కాఫీ తాగిన వెంటనే ఉత్సాహంగా అనిపిస్తుంది, కానీ ఆ ప్రభావం ఎక్కువసేపు ఉండదు. త్వరగా మళ్ళీ అలసిపోవచ్చు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి.

నెమ్మదిగా అరిగించుకునేవారు: ఈ రకం జీన్ ఉన్నవారికి కెఫిన్ ప్రభావం ఎక్కువసేపు ఉంటుంది. కాఫీ తాగితే గంటల తరబడి చురుకుగా ఉంటారు. అయితే గుండె దడ, ఆందోళన, రాత్రి నిద్ర పట్టకపోవడం లాంటి ఇబ్బందులు రావచ్చు.

డాక్టర్ విశాఖ చెప్పినట్లు, “కొంతమంది ఎన్ని కప్పులు కాఫీ తాగినా వెంటనే నిద్రపోగలరు. మరికొందరికి ఒక కప్పు తాగినా నిద్ర రాదు. ఈ తేడా మన జీన్స్‌లో ఉంది.”

మీ కాఫీ అలవాటును ఎలా మెరుగుపరచుకోవాలి?

మీ శరీరం కాఫీకి ఎలా స్పందిస్తుందో తెలుసుకుని, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

తక్కువగా తాగండి: కాఫీ ఎక్కువగా తాగకుండా చూసుకోండి.

పడుకునే ముందు వద్దు: పడుకోవడానికి కనీసం 12 గంటల ముందు కాఫీ తాగడం మానేయండి.

నీరు ఎక్కువగా తాగండి: కాఫీ తాగిన తర్వాత ఎక్కువ నీళ్లు తాగడం మంచిది.

మీకు ఏ రకం జీన్ ఉందో తెలుసుకోవాలంటే జన్యు పరీక్ష కూడా చేయించుకోవచ్చు. మీ శరీరం కాఫీని ఎలా తీసుకుంటుందో అర్థం చేసుకోవడం వల్ల మీ ఆరోగ్యం, నిద్ర, మానసిక స్థితిని మెరుగుపరచుకోవచ్చు. కాబట్టి మరోసారి కాఫీ తాగే ముందు మీ శరీర తత్వాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకోండి..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *