Cinema: 9 కోట్ల బడ్జెట్.. 10 రోజులకే 51 కోట్ల కలెక్షన్లు.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న చిన్న సినిమా..

Cinema: 9 కోట్ల బడ్జెట్.. 10 రోజులకే 51 కోట్ల కలెక్షన్లు.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న చిన్న సినిమా..


Cinema: 9 కోట్ల బడ్జెట్.. 10 రోజులకే 51 కోట్ల కలెక్షన్లు.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న చిన్న సినిమా..

ఈ సినిమాలో స్టార్ హీరోలు, హీరోయిన్స్ లేరు. పెద్ద పెద్ద యాక్షన్ సీక్వెన్స్ లు, వీఎఫ్ ఎక్స్ హంగులు లేవు. స్పెషల్ సాంగుల సందడి లేదు. సాధారణంగా ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేని సినిమాపై జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. పైగా ఇది లో బడ్జెట్ మూవీ. అయితే ఈ చిన్న సినిమా మాత్రం కేవలం కంటెంట్ తోనే సూపర్ హిట్ అందుకుంది. పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లు లేనప్పటికీ కోట్లు రాబడుతోంది. ఈ సినిమా పేరు ‘తాయి కిళవి’. ఫిబ్రవరి 27న ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. చాలా తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ కామెడీ చిత్రానికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబడుతోంది. శివకుమార్ మురుగేసన్ దర్శకత్వం వహించిన ‘తాయి కిళవి’ ఒక కామెడీ డ్రామా. ఆసక్తికరంగా, ఇందులో తెలిసిన స్టార్లు ఎవరూ లేరు. దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి రాధిక శరత్‌కుమార్ ఇందులో లీడ్ రోల్ పోషించింది. 63 ఏళ్ల వయసులో ఆమె పోషించిన ఈ ఊర మాస్‌ పాత్ర, ఆమె చెప్పే డైలాగులు ప్రేక్షకుల్ని తెగ ఆకట్టు కుంటున్నాయి

‘తాయి కిళవి’ సినిమా బడ్జెట్ కేవలం రూ.9 కోట్లు మాత్రమే. కానీ ఈ సినిమా విడుదలైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లు వసూలు చేసింది. ‘సక్నిల్క్’ నివేదిక ప్రకారం, ఈ చిత్రం 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 54 కోట్లు వసూలు చేసింది. కేవలం భారతదేశంలో మాత్రమే ఈ చిత్రం రూ. 38 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రానికి IMDbలో 8.2 రేటింగ్ లభించింది. కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్నిర్మించిన ఈ చిత్రానికి శివకుమార్‌ మురుగేశన్ (Sivakumar Murugesan) దర్శకత్వం వహించారు. కేవలం రాధిక కోసమే ఈ సినిమా చూడాలి అనుకునే వాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ప్రస్తుతం ఈ ‘తాయి కిళవి’ జోరు చూస్తుంట త్వరలోనే ఈ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

థియేటర్లలో రాధిక సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *