ఓటీటీలో నిత్యం కొత్త కంటెంట్ సిరీస్, సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. మొదటి సీజన్ నుండే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. లాక్‌డౌన్ సమయంలో ప్రేక్షకుల కోసం విడుదలైన అలాంటి సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ ఇప్పటికీ ట్రెండ్ అవుతుంది. ఈ సిరీస్ సాధారణ ప్రేమకథ కాదు లేదా సాధారణ డ్రామా కాదు. ఇది థ్రిల్, ఉత్కంఠ, క్రూరమైన సీరియల్ కిల్లర్‌తో కూడిన ఉత్కంఠభరితమైన కథ. మొదటి సీజన్‌లో మానసికంగా అస్థిరంగా ఉన్న ఒక బాలుడు ఆధ్యాత్మిక విషయాలపై నిమగ్నమై ఉంటాడు. అతడు తన శక్తులను ఉపయోగించి ప్రజల బ్రెయిన్ వాష్ చేస్తాడు. ఆ తర్వాత ఒకదాని తర్వాత మరొకటి దారుణమైన హత్యలు జరుగుతుంటాయి.
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi: అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఆ తర్వాత చిరు చెల్లెలిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పుడు బుల్లితెరపై..
ఈ సిరీస్ లో ప్రతి ఎపిసోడ్ క్లైమాక్స్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. హత్యల వెనుక నిజాలు రాబట్టేందురు సీబీఐ రంగంలోకి దిగుతుంది. మూఢనమ్మకాలు, హత్యలు, దర్యాప్తుల విచిత్రమైన కలయిక మిమ్మల్ని ఒక్క క్షణం కూడా తెర నుండి దూరంగా కదలనివ్వదు. ఈ సిరీస్ పేరు “అసుర్”. ఈ సిరీస్ మొదట 2020లో వూట్ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది. కానీ తరువాత ఇది జియో హాట్‌స్టార్‌లోకి వచ్చింది. ఇందులో అర్షద్ వార్సీ సిబిఐ అధికారి పాత్రలో నటించారు. అలాగే వరుణ్ సోబ్తి, రిద్ధి డోగ్రా, లోలార్క్ దుబే కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు.
ఇవి కూడా చదవండి : Tollywood: స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్.. సౌత్ ఇండస్ట్రీలో సెన్సేషన్ ఈ అమ్మడు..
ఇప్పటికే ఈ సిరీస్ రెండు సీజన్స్ విడుదలయ్యాయి. ఇప్పుడు అందరూ సీజన్ 3 కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు, కానీ ఈ సీజన్ 2026లో రాబోతుందనే చర్చ నడుస్తుంది. ప్రస్తుతం ఈ సిరీస్ రెండు సీజన్స్ ఆకట్టుకుంటున్నాయి.
ఇవి కూడా చదవండి : Tollywood : అబ్బబ్బో.. సీరియల్లో అమాయకంగా.. నెట్టింట పిచ్చెక్కించేలా.. హీరోయిన్స్ సైతం దిగదుడుపే..
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో ఆడపులి.. యూత్‌కు తెగ నచ్చేస్తోన్న కంటెస్టెంట్..