Cinema: బాబోయ్.. ఆరేళ్లుగా ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్.. క్లైమాక్స్ చూస్తే ..

Cinema: బాబోయ్.. ఆరేళ్లుగా ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్.. క్లైమాక్స్ చూస్తే ..


సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చూడడమంటే మీకు ఇష్టమా.. ? అయితే ఇప్పుడు ఓటీటీల్లో ఎక్కువగా ఈ జానర్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. హారర్, మిస్టరీ జానర్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా మాత్రం జనాలను తెగ ఆకట్టుకుంటుంది. దాదాపు ఆరేళ్లుగా ఓటీటీ ప్రపంచంలో దూసుకుపోతుంది. ఉత్కంఠభరితమైన ట్విస్టులు.. దిమ్మతిరిగే క్లైమాక్స్ తో ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంతకీ ఆ సినిమా పేరెంటో తెలుసా.. ? అదే రాక్షసుడు. 2018లో విడుదలైన తమిళ సినిమా రాట్సాసన్ చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. పోలీస్ అధికారి కుటుంబం, అతడి జీవితం చుట్టూ తిరిగే భావోద్వేగ ప్రయాణమే ఈ చిత్రం. ఇందులో బెల్లెంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రదాన పాత్రలలో నటించారు.

ఇవి కూడా చదవండి : Tollywood : 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోతో పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..

పాఠశాల విద్యార్థులను దారుణంగా హత్య చేస్తున్న సీరియల్ కిల్లర్ ను ఓ పోలీస్ అధికారి ఎలా పట్టుకుంటాడు అనేది సినిమా. ఈ మూవీ ప్రతి మలుపులోనూ ప్రేక్షకులను ఉత్కంఠ కలుగజేస్తుంది. ఈ సినిమా ఆద్యంతం జనాలను ఆకట్టుకుంటూ సాగుతుంది. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, శరవణన్, వినయ్ రాయ్, సుజన్ కీలక పాత్రలు పోషించారు. గిబ్రాన్ అద్భుతమైన బీజీఎమ్ అందించారు.

ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

రామ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రతి క్షణం ఉత్కంఠ, ఊహించని మలుపులతో సాగే ఈ సినిమా ఆద్యంతం జనాలను కట్టిపడేస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమాలు.. 55 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగల్.. ఇప్పటికీ యూత్‏లో యమ క్రేజ్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *