Cinema : బడ్జెట్ రూ.41 కోట్లు.. కలెక్షన్స్ 210 కోట్లు.. 12 ఏళ్లుగా బాక్సాఫీస్‏ను శాసిస్తున్న సినిమా.. ఇప్పుడు ఓటీటీలో..

Cinema : బడ్జెట్ రూ.41 కోట్లు.. కలెక్షన్స్ 210 కోట్లు.. 12 ఏళ్లుగా బాక్సాఫీస్‏ను శాసిస్తున్న సినిమా.. ఇప్పుడు ఓటీటీలో..


నిజమైన సంఘటన ఆధారంగా స్క్రీన్ ప్లే రూపొందించినప్పటికీ, దానిని ఆసక్తికరంగా మార్చడానికి కొన్ని కల్పిత సన్నివేశాలను జత చేయడం సినిమా సంప్రదాయం అనుకోవచ్చు. ఒక అథ్లెట్ జీవితం ఆధారంగా రూపొందించిన ఒక సినిమా దాని బడ్జెట్ కంటే 4 రెట్లు లాభాన్ని తీసుకువచ్చింది. ఈ సినిమా విడుదలై 12 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంకా ట్రెండింగ్ లోనే దూసుకుపోతుంది. ఆ సినిమా పేరు భాగ్ మిల్కా భాగ్. 2013లో బాలీవుడ్ లో విడుదలైన ఈ చిత్రానికి రాకేష్ ఓం ప్రకాష్ దర్శకత్వం వహించగా ఫర్ఙాన్ అక్తర్ ప్రధాన పాత్ర పోషించారు.

ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?

ప్రముఖ భారతీయ రన్నర్ మిల్కా సింగ్ జీవిత కథ ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రాన్ని మొత్తం రూ.41 కోట్లతో నిర్మించగా.. 210 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఆ సమయంలో, ఇది తక్కువ బడ్జెట్‌తో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా ఈ చిత్రం 6 ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సహా మొత్తం 55 అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రంలో మిల్కా సింగ్ పాత్రను పోషించిన ఫర్హాన్ అక్తర్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రెండు జాతీయ అవార్డులు, మొత్తం 14 అంతర్జాతీయ భారతీయ చలనచిత్ర అకాడమీ అవార్డులను గెలుచుకుంది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..

ఈ చిత్రంలో ప్రముఖ నటుడు అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ అతిధి పాత్రలో నటించినప్పటికీ, ఆమె నటన అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాకు హీరోయిన్ సోమన్ కపూర్ కేవలం రూ.11 మాత్రమే పారితోషికం తీసుకుందట. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీతోపాటు యూట్యూబ్ లోనూ అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *