Cinema : థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో బ్లాక్ బస్టర్.. ట్రెండ్ అవుతున్న సస్పెన్స్ త్రిల్లర్ మూవీ..

Cinema : థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో బ్లాక్ బస్టర్.. ట్రెండ్ అవుతున్న సస్పెన్స్ త్రిల్లర్ మూవీ..


సాధారణంగా చాలా సినిమాలు ఎన్నో అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అవుతుంటాయి. కానీ ఇప్పుడు కంటెంట్ నచ్చితే చాలు బ్రహ్మారథం పడుతున్నారు అడియన్స్. థియేటర్లలో అట్టర్ ప్లాప్ అయినప్పటికీ ఓటీటీలో మాత్రం సూపర్ హిట్ రెస్పాన్స్ అందుకుంటున్న సినిమాల గురించి మీకు తెలుసా.. ? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ పెద్దగా ఆడకపోయినా ఓటీటీలో మాత్రం ట్రెండ్ అవుతుంది. ఈ సస్పెన్స్ సస్పెన్స్-థ్రిల్లర్ సినిమా థియేటర్లలో ఫ్లాప్ అయింది కానీ ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉంది. గతేడాది విడుదలైన ఈ చిత్రాన్ని జనాలు అంతగా పట్టించుకోలేదు. ఆ మూవీ పేరు ది బకింగ్ హామ్ మర్డర్స్. 2023 సెప్టెంబర్ 13న ఈ సినిమా అడియన్స్ ముందుకు వచ్చింది.

ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..

దాదాపు 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కేవలం 20 కోట్లు మాత్రమే వసూలు చేసి నిర్మాతలకు నష్టాలను మిగుల్చింది. కనీసం సినిమా ఖర్చులను సైతం రాబట్టలేకపోయింది. అయితే థియేటర్లలో ఈ చిత్రాన్ని పట్టించుకోని జనాలు.. ఇప్పుడు తెగ చూసేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. విడుదలైన కొన్ని రోజుల్లోనే టాప్ 10 ట్రెండింగ్ సినిమాల జాబితాలోకి చేరుకుంది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. సెకండ్ ఇన్నింగ్స్‏లోనూ తగ్గని క్రేజ్.. ఈ బ్యూటీ ఎవరంటే..

కథ విషయానికి వస్తే..

ఈ సినిమా కథ జస్ప్రీత్ భమ్రా అలియాస్ జాస్ (కరీనా కపూర్) చుట్టూ తిరుగుతుంది. ఆమె ఒక ప్రభుత్వ గూఢచారి. కానీ ఆమె జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. ఆమె 10 ఏళ్ల కొడుకును మానసిక వికలాంగుడు కాల్చి చంపేస్తాడు. అతడికి శిక్ష పడినప్పటికీ జస్ప్రీత్ బాధ తగ్గదు. బిడ్డను కోల్పోయిన తర్వాత ఆమె జీవితం ముక్కలవుతుంది. ఆ తర్వాత జస్ప్రీత్ తీసుకున్న నిర్ణయంతో ఆమె జీవితం మలుపులు తిరుగుతుంది. ఈ చిత్రంలో కరీనా కపూర్, రణవీర్, ప్రబ్లీన్ సంధు కీలకపాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?

ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *