ప్రస్తుతం ఓటీటీల్లో కంటెంట్ నచ్చితే చాలు చిన్న సినిమాలను హిట్ చేస్తున్నారు. ముఖ్యంగా థియేటర్లలో డిజాస్టర్ అయిన సినిమాలకు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై మంచి రెస్పాన్స్ వస్తుంది. స్టార్ హీరోహీరోయిన్స్ లేకపోయినా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలు దూసుకుపోతున్నాయి. హారర్, సస్పెన్స్, థ్రిల్లర్, మిస్టరీ చిత్రాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఓ సినిమా ఓటీటీలో సెన్సేషన్ అవుతుంది. నిజానికి ఈ మూవీ థియేటర్లలో వచ్చినప్పుడు ఎవరూ అంతగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఈ తెలుగు రొమాంటిక్ సినిమాను చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు కన్యాకుమారి.
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi: అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఆ తర్వాత చిరు చెల్లెలిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పుడు బుల్లితెరపై..
కన్యాకుమారి.. ఈ చిత్రానికి సృజన్ అట్టాడ దర్శకత్వం వహించగా.. ఆగస్ట్ 17న థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ అంతగా రాణించలేకపోయింది. ఇటీవలే సెప్టెంబర్ 17న ఓటీటీలో రిలీజ్ అయ్యింది.ఇప్పుడు ఈ మూవీ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. స్టార్స్ లేకపోయినా అద్భుతమైన , ఎమోషనల్ కథతో దూసుకుపోతుంది. ఎలాంటి గ్లామర్ టచ్ లేకుండానే పల్లెటూరి నేపథ్యంలో వచ్చిన ఈ ప్రేమకథకు ఇప్పుడు యూత్ తెగ అట్రాక్ట్ అవుతున్నారు. ప్రేమ, జీవితం, బ్రేకప్ వంటి అంశాలతో ఈ సినిమా సాగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోస్, ఆహా ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇవి కూడా చదవండి : Tollywood: స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్.. సౌత్ ఇండస్ట్రీలో సెన్సేషన్ ఈ అమ్మడు..
ఇవి కూడా చదవండి
ఇందులో గీత్ సైనీ ప్రధాన పాత్రలో నటించగా.. శ్రీచరణ్ హీరోగా నటించారు. రవి నిడమర్తి మ్యూజిక్, సినిమాటోగ్రఫీ సినిమాకు హైలెట్ అయ్యాయి. ప్రస్తుతం ఈ మూవీ క్లిప్స్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు జనాలు. ప్రస్తుతం ఈ మూవీ రెండు ఓటీటీల్లో దూసుకుపోతుంది.
ఇవి కూడా చదవండి : Tollywood : అబ్బబ్బో.. సీరియల్లో అమాయకంగా.. నెట్టింట పిచ్చెక్కించేలా.. హీరోయిన్స్ సైతం దిగదుడుపే..
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో ఆడపులి.. యూత్‌కు తెగ నచ్చేస్తోన్న కంటెస్టెంట్..