Cinema : గూస్ బంప్స్ మూమెంట్.. నేషనల్ అవార్డ్స్ వేడుకల్లో 5 ఏళ్ల చిన్నారి హైలెట్.. ఎవరంటే..

Cinema : గూస్ బంప్స్ మూమెంట్.. నేషనల్ అవార్డ్స్ వేడుకల్లో 5 ఏళ్ల చిన్నారి హైలెట్.. ఎవరంటే..


71వ చలనచిత్ర అవార్డుల వేడుకలు సెప్టెంబర్ 23న ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఇన్నాళ్లు సినీపరిశ్రమలో అద్భుతమైన నటనతోపాటు ప్రయోగాత్మక చిత్రాలతో అలరించిన తారలు పురస్కారాలు అందుకున్నారు. ఈ వేడుకలలో ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు ఇలా పలు విభాగాల్లో నేషనల్ అవార్డ్స్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందజేశారు. మలయాళీ నటుడు మోహన్ లాల్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్నారు. ఉత్తమ నటులుగా జవాన్ చిత్రానికి గానూ షారుఖ్ ఖాన్, 12 ఫెయిల్ సినిమాకుగానూ విక్రాంత్ మాస్సే అవార్డ్స్ అందుకున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ కార్యక్రమంలో ఐదేళ్ల చిన్నారి త్రిష తోసర్ అందరి దృష్టిని ఆకర్షించింది. నేషనల్ అవార్డ్స్ వేడుకలలో ఉత్తమ బాలనటిగా అవార్డ్ అందుకుని హైలెట్ అయ్యింది.

ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi: అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఆ తర్వాత చిరు చెల్లెలిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పుడు బుల్లితెరపై..

ఈ ఏడాది 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ బాల నటీనటులుగా మొత్తం 5గకురు చిన్నారులు అవార్డ్స్ అందుకున్నారు. త్రిష తోసర్, శ్రీనివాస్ పోకలే, భార్గవ్ జగ్‌తాప్, కబీర్ ఖండారే, సుకృతి వేణి బండ్రెడ్డి పురస్కారాలు తీసుకున్నారు. వీరందరిలో త్రిష తోసర్ అనే 5ఏళ్ల చిన్నారి అందరి హృదయాలు దొచుకుంది. అవార్డ్స్ అందుకుంటున్న సమయంలో త్రిష తోసర్ ముఖంలో చిరునవ్వు.. హందాతనం అందరిని ఫిదా చేసింది. దీంతో ఇప్పుడు ఈ చిన్నారికి ఫాలోయింగ్ పెరిగిపోయింది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Tollywood: స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్.. సౌత్ ఇండస్ట్రీలో సెన్సేషన్ ఈ అమ్మడు..

త్రిష హిందీలో అనేక చిత్రాల్లో నటించింది. మహేష్ మంజ్రేకర్, సిద్ధార్థ్ జాదవ్ వంటి నటులతో కలిసి పనిచేసింది. త్రిష భార్గవ్ జగ్తాప్‌తో కలిసి నటించిన మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహించిన “పున్హా శివాజీరాజే భోసలే”లో కూడా కీలక పాత్ర పోషించింది.

ఇవి కూడా చదవండి : Tollywood : అబ్బబ్బో.. సీరియల్లో అమాయకంగా.. నెట్టింట పిచ్చెక్కించేలా.. హీరోయిన్స్ సైతం దిగదుడుపే..

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్ హౌస్‏లో ఆడపులి.. యూత్‏కు తెగ నచ్చేస్తోన్న కంటెస్టెంట్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *