దాదాపు ఏడాది క్రితం బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించిన సినిమా గురించి మీకు తెలుసా.. ? ఎలాంటి హడావిడి, అంచనాలు లేకుండానే విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అదే మెయియజగన్. ఈ సినిమాను తెలుగులో సత్యం సుందరం పేరుతో రిలీజ్ చేశారు. డైరెక్టర్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కార్తీ, అరవింద సామి కీలకపాత్రలు పోషించారు. తమిళంలో సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయగా.. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అప్పట్లో ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ అడియన్స్ ముందుకు వచ్చి సంవత్సరం పూర్తైంది. ఇందులో శ్రీ దివ్య, రాజ్‌కిరణ్, దేవదర్శిని, జయప్రకాష్, ఇళవరసు, కరుణాకరన్, శరణ్ శక్తి కీలకపాత్రలు పోషించారు.
ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..
ఇవి కూడా చదవండి
తమిళంలో విడుదలైన ఈ సినిమాపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో న్యాచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. గత పదేళ్లలో తాను చూసిన అత్యుత్తమ సినిమా ఇదే అని అన్నారు. ఇందులో కార్తీ, అరవింద సామి యాక్టింగ్ జనాలను కట్టిపడేసింది. ఇప్పటికీ ఈ సినిమాకు ఓటీటీలో విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. అటు బాక్సాఫీస్, ఇటు ఓటీటీలో ఈ సినిమా ట్రెండింగ్ అయ్యింది.
ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ తగ్గని క్రేజ్.. ఈ బ్యూటీ ఎవరంటే..
కథ విషయానికి వస్తే..
కుటుంబ పరిస్థితుల కారణంగా చిన్న వయసులోనే తన సొంత ఊరును విడిచిపెట్టిన నటుడు అరవిందసామి, చాలా సంవత్సరాల తర్వాత తన సొంత ఊరికి తిరిగి వస్తాడు. అక్కడ, తనపై అపారమైన ప్రేమను కురిపించిన వ్యక్తిని కలుస్తాడు. తన పేరు కూడా తెలియక ఇబ్బంది పడుతున్న అరవిందసామి చివరకు తన గురించి ఎలా తెలుసుకున్నాడనేది ఈ సినిమా కథ. ఈ చిత్రానికి గోవింద్ వసంత్ అద్భుతమైన సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?
அன்பே இறை. அன்பே நிறை. அன்பே மறை.
அன்பே அருட்பெரும்மெய் 🤍
மெய்யழகன் – ஒரு ஆண்டின் நினைவுகள் ✨#1YearOfMeiyazhagan @Karthi_Offl @thearvindswami #PremKumar @Suriya_offl #Jyotika @rajsekarpandian #Rajkiran @SDsridivya #Jayaprakash @ActorSarann #GovindVasantha… pic.twitter.com/Y1T9km6DwD
— 2D Entertainment (@2D_ENTPVTLTD) September 27, 2025
ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..