ఇటీవల కాలంలో హారర్, సస్పెన్స్ థ్రిల్లర్, యాక్షన్ డ్రామాలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. అయితే ఇప్పుడు ఓ సినిమా గురించి మాట్లాడుకుందామా.. మంత్రాలు, తాంత్రిక ఆచారాలు, మాయాజాలం వంటి అంశాలను కలిగి ఉన్న ఈ హర్రర్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో దూసుకుపోతుంది. తక్కువ సమయంలోనే జనాలను ఆకట్టుకుంటుంది. మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు తంత్ర. ఈ మూవీ కథ రేఖ అనే యువతి చుట్టూ తిరుగుతుంది. రేఖ అనే అమ్మాయి పుట్టుకతోనే మాయాజాలంతో శపించబడింది. పౌర్ణమి రాత్రి, ఒక రాక్షసుడు ఆమెను వెతుక్కుంటూ భయానక పరిస్థితిని సృష్టిస్తాడు.
ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?
అదే సమయలో ఆమె తన కాలేజీ క్లాస్మేట్ తేజుతో ప్రేమలో పడుతుంది. కానీ ఒక వేశ్య కొడుకు తేజు వారి ప్రేమకథలో అడ్డంకులు సృష్టిస్తాడు. ఇంతలో ఒక తాంత్రికుడు రేఖను బలి ఇవ్వాలని ప్లాన్ చేస్తాడు. ఆమె మంత్రగాడి నుండి ఎలా తప్పించుకుంది? తేజుపై ఆమెకున్న ప్రేమ ఏమైంది? మరి పుట్టినప్పటి నుండి ఆమెకు ఉన్న శాపం ఏమిటి? అనేది సినిమా కథ. ఈ సినిమాలో వచ్చే ప్రతి సన్నివేశం వణుకు పుట్టిస్తుంది. ఆద్యంతం ఈ మూవీ కథ కట్టిపడేస్తుంది.
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..
ఈ సినిమాలో అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటించగా.. సలోని, ధనుష్ రఘుముద్రి, టెంపర్ వంశీ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమా మార్చి 2023లో థియేటర్లలో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియోలలో స్ట్రీమింగ్ అవుతుంది. హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో సాగే ఈ సినిమా ప్రేక్షకులకు మంచి థ్రిల్ అందిస్తుంది. అయితే ఈ సినిమాను మాత్రం చిన్న పిల్లలతో అస్సలు చూడకూడదని నిపుణులు తెలుపుతున్నారు.
ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..