
మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా 158 చిత్రంపై కీలక అప్‌డేట్‌లు బయటపడ్డాయి. దర్శకుడు బాబీతో చిరంజీవి చేయనున్న ఈ ప్రాజెక్ట్ మార్చి 14న లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధమై లాక్ చేయబడింది. మెగా అభిమానులకు పూనకాలు తెప్పించేలా బాబీ ఈ చిత్రాన్ని ఓ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందించనున్నారు. చిరంజీవి ఈ సినిమాలో గతంలో ఎన్నడూ లేనంత స్టైలిష్‌గా కనిపించనున్నారు. అంతేకాకుండా, ఒక టీనేజ్ అమ్మాయికి తండ్రి పాత్రలో ఆయన నటించనున్నారు. ఈ సినిమా కథ కోల్‌కతా నేపథ్యంగా సాగే ఓ శక్తివంతమైన మాఫియా డ్రామాగా తెరకెక్కనుంది. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ ఈ కథలో అత్యంత కీలక భూమిక పోషించనుంది. ఈ పాత్ర కోసం అనస్వర రాజన్‌ను మేకర్స్ దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టాలీవుడ్ లో నెంబర్ వన్ కుర్చీ దక్కించుకున్న ముద్దుగుమ్మ ఎవరో తెలుసా !
Ustaad Bhagat Singh: ఉస్తాద్ ఊహించని సర్‌ప్రైజ్.. ఫ్యాన్స్‌కు పండగే..
మారుతున్న ఆడియన్స్ మైండ్ సెట్.. ఆ సినిమాలకు పెను సవాల్
Dhurandhar 2: ధురంధర్ 2 ఆ రోజున వస్తుందా.. రాదా ??
Toxic: అరె.. టాక్సిక్ సినిమా వాయిదా పడటానికి కారణం అదా..