తెలుగు సినిమా చరిత్రలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం 1978లో మొదలైంది. అయితే ఆయన తండ్రి, కొణిదెల వెంకట్రావు అంతకు ముందే, అంటే 1969లోనే నటుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. 1969లో విడుదలైన జగత్ కిలాడీలు అనే చిత్రంలో వెంకట్రావు ఒక చిన్న పాత్రలో కనిపించారు. ఆ తర్వాత కొన్ని సినిమా ఆఫర్లు వచ్చినా, కుటుంబ బాధ్యతల కారణంగా ఆయన ఉద్యోగానికే ప్రాధాన్యతనిచ్చారు. తాను నటనలో రాణించలేకపోవడంతో, తన కుమారుడు చిరంజీవిని సినిమాల వైపు ప్రోత్సహించారు.
1983లో చిరంజీవి హీరోగా బాపు దర్శకత్వంలో రూపొందిన మంత్రి గారి వియ్యంకుడు చిత్రంలో వెంకట్రావు మరోసారి తెరపై కనిపించారు. ఈ చిత్రం చిరంజీవి ఖైదీ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చింది. ఇందులో వెంకట్రావు మంత్రి పాత్రలో మెరిశారు. ఈ పాత్ర కోసం చిరంజీవి మామ, హాస్యనటుడు అల్లు రామలింగయ్య, వెంకట్రావు పేరును దర్శకుడు బాపుకు సూచించారు. బాపుతో పాటు చిరంజీవి, వెంకట్రావు కూడా ఈ ఆలోచనకు అంగీకరించారు. మంత్రి గారి వియ్యంకుడు చిత్రంలో చిరంజీవి, ఆయన తండ్రి కలిసి నటించినప్పటికీ, దురదృష్టవశాత్తు వారి మధ్య ఎలాంటి కాంబినేషన్ సీన్స్ లేవు. ఒకవేళ అలాంటి సన్నివేశాలు ఉండి ఉంటే, అవి మెగా అభిమానులకు చిరకాల జ్ఞాపకాలుగా మిగిలిపోయేవి. మొత్తానికి, కొణిదెల వెంకట్రావు జగత్ కిలాడీలు, మంత్రి గారి వియ్యంకుడు చిత్రాల్లో నటుడిగా కనిపించారు.
ఇది చదవండి: నేను, రజినీకాంత్ షూటింగ్‌లో ఒకటే సిగరెట్ కాల్చేవాళ్లం.. ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ నటుడు