
టాలీవుడ్లో దిగ్గజ నటులైన అక్కినేని నాగేశ్వరరావు, మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోలకు ఒక నటి అంటే గౌరవం, అలాగే కాసింత భయం ఉండేదని టాక్. ఆమె మరెవరో కాదు, ప్రముఖ నటి రాధిక శరత్ కుమార్. రాధిక చిరంజీవితో కలిసి 25కు పైగా సినిమాల్లో నటించి, అగ్ర కథానాయికల్లో ఒకరిగా వెలుగొందారు. అదే విధంగా ఏఎన్నార్‌తో కూడా ఆమె పలు చిత్రాల్లో నటించారు.
రాధిక, చిరంజీవి చాలా సన్నిహితంగా ఉండేవారని, తరచు సరదాగా వాదులాడుకునేవారని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. చిరంజీవి సతీమణి సురేఖ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని కూడా ఆమె పేర్కొన్నారు. రామ్ చరణ్ తన కళ్ళ ముందే పెరిగి పెద్ద హీరో అవ్వడం, ముఖ్యంగా త్రిబుల్ ఆర్ సినిమాలో అతని అద్భుత నటన చూసి ఎంతో గర్వపడ్డానని రాధిక గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. హీరోలతో ఎంత చనువుగా ఉన్నప్పటికీ, తాను వృత్తిపరమైన హద్దులు దాటలేదని, ఆ విషయంలో కఠినంగా ఉండేవారు కాబట్టే ఎవరూ తనతో హద్దులు మీరి ప్రవర్తించేవారు కాదని రాధిక అన్నారు.
చిరంజీవి కూడా తనకు భయపడతారని, కానీ మేమిద్దరం చాలా క్లోజ్‌గా ఉంటామని ఆమె తెలిపారు. ఏఎన్నార్ సైతం ఒక సందర్భంలో “రాధికతో జాగ్రత్తగా ఉండాలి” అని అన్నారట. చిరంజీవి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆయన ఎదుగుదలను చూశానని, ఖైదీ చిత్రంలో నటించకపోయినా, ఆ సినిమాతో చిరంజీవి స్టార్ హీరోగా మారడం తనకెంతో ఆనందాన్నిచ్చిందని రాధిక పేర్కొన్నారు. చిరంజీవి విజయాలను చూసి తాను గర్వపడుతున్నానని ఆమె తెలిపారు.
ఇది చదవండి: నేను, రజినీకాంత్ షూటింగ్లో ఒకటే సిగరెట్ కాల్చేవాళ్లం.. ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ నటుడు