Headlines

Child Psychology: పిల్లలను చదవమని కొట్టక్కర్లేదు..! 2000 ఏళ్ల క్రితమే ప్లేటో చెప్పిన చిన్న ట్రిక్ ఇది

Child Psychology: పిల్లలను చదవమని కొట్టక్కర్లేదు..! 2000 ఏళ్ల క్రితమే ప్లేటో చెప్పిన చిన్న ట్రిక్ ఇది


గొప్ప తత్వవేత్తలను ప్రపంచానికి అందించిన ప్లేటో, పిల్లల పెంపకం విద్యపై అప్పట్లోనే అత్యంత ఆధునికమైన ఆలోచనలను పంచుకున్నారు.
సోక్రటీస్ శిష్యుడైన ప్లేటో, పిల్లల మెదడులోని అసలైన ప్రతిభను ఎలా వెలికితీయాలి? నిర్బంధ విద్య వల్ల కలిగే ప్రమాదాలేంటి? అనే విషయాలపై చెప్పిన ఆసక్తికరమైన మనస్తత్వ రహస్యాలను ఇప్పుడు తెలుసుకుందాం.

నిర్బంధ విద్య ఒక శాపం!

పిల్లలను బెదిరించడం, కొట్టడం లేదా కఠినమైన ఆంక్షల మధ్య చదివించడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువని ప్లేటో హెచ్చరిస్తున్నారు. భయంతో చదివినప్పుడు పిల్లవాడు మీ మాట వినవచ్చు కానీ, ఆ చిన్న మెదడులోని అసలైన సృజనాత్మకత (Creativity) ఎప్పటికీ బయటకు రాదు. బలవంతంగా నేర్చుకునేది మెదడులో శాశ్వతంగా నిలవదు.

ఆటపాటల ద్వారానే అసలైన అభ్యాసం :

పిల్లలకు ఏ విషయంలో ఆసక్తి ఉంది? ఏ పని చేస్తే వారు ఆనందంగా ఉంటారు? అనేది గుర్తించి, దాని ద్వారానే విద్యను బోధించాలని ప్లేటో సూచిస్తున్నారు.

క్రీడల ద్వారా: ఆటల ద్వారా విషయాలను నేర్పినప్పుడు పిల్లలు ఒత్తిడి లేకుండా సులభంగా గ్రహిస్తారు.

అభిరుచుల గుర్తింపు: ప్రతి బిడ్డ ఒక ప్రత్యేక ప్రతిభతో పుడతాడు. అందరినీ ఒకే గాటన కట్టకుండా, వారి ప్రత్యేకతను గుర్తించి ప్రోత్సహించాలి.

తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర:

పిల్లలు చదువును ఆస్వాదించాలంటే, ముందుగా పెద్దలు వారిని ప్రేమతో అర్థం చేసుకోవాలి. వారిలో ఉత్సుకతను (Curiosity) రేకెత్తించేలా బోధనా పద్ధతులు ఉండాలి. పిల్లలపై పుస్తకాల భారం మోపడం కంటే, వారిలో కొత్త విషయాలను తెలుసుకోవాలనే తపనను పెంచడం విద్య యొక్క అసలైన ఉద్దేశ్యం.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. పిల్లల పెంపకంలో వారి మానసిక స్థితిని అర్థం చేసుకుని నడచుకోవడం ఉత్తమం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *