
పిల్లల సున్నితమైన జుట్టుకు పోషణ అందించాలంటే కేవలం షాంపూలు సరిపోవు. ఆముదంలో ఉండే పోషకాలను ఇతర సహజ నూనెలతో కలిపి వాడితే ఫలితం రెట్టింపు అవుతుంది. కొబ్బరి నూనె నుండి ఆర్గన్ ఆయిల్ వరకు.. వేసవిలో జుట్టును తేమగా ఉంచి, కుదుళ్లను దృఢపరిచే ఆ ఐదు అద్భుత నూనెల మిశ్రమాలు ఏమిటి? వాటిని ఎలా ఉపయోగించాలో చూద్దాం..
1. కొబ్బరి నూనె (Coconut Oil):
ఇది జుట్టుకు సహజమైన మెరుపును ఇస్తుంది. ఒక టీస్పూన్ ఆముదానికి రెండు టీస్పూన్ల కొబ్బరి నూనె కలిపి మసాజ్ చేయండి. ఇది వేసవి ఎండ వల్ల జుట్టు పొడిబారకుండా కాపాడుతుంది.
2. ఆర్గన్ ఆయిల్ (Argan Oil):
దీనిని ‘లిక్విడ్ గోల్డ్’ అంటారు. విటమిన్-E యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉండే ఈ నూనె, ఆముదంతో కలిసినప్పుడు బలహీనమైన జుట్టును వేగంగా దృఢపరుస్తుంది.
3. బాదం నూనె (Almond Oil):
మెగ్నీషియం పుష్కలంగా ఉండే బాదం నూనె జుట్టు చివర్లు చిట్లిపోకుండా చూస్తుంది. ఆముదం మరియు బాదం నూనెను సమాన నిష్పత్తిలో కలిపి వారానికి రెండుసార్లు నిద్రపోయే ముందు అప్లై చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
4. ఆలివ్ నూనె (Olive Oil):
చిక్కుబడిన జుట్టును మృదువుగా మార్చడంలో ఇది దిట్ట. రెండు టీస్పూన్ల ఆలివ్ నూనెకు ఒక టీస్పూన్ ఆముదం కలిపి ఐదు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి తలస్నానం చేయించండి.
5. జోజోబా ఆయిల్ (Jojoba Oil):
వేసవిలో చెమట వల్ల స్కాల్ప్ పై వచ్చే దురదను తగ్గించడానికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇది జుట్టు జిడ్డుగా అనిపించకుండా, కుదుళ్లను హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.
ముఖ్యమైన టిప్స్:
నూనె రాసిన తర్వాత వేలికొనలతో సున్నితంగా మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ పెరిగి జుట్టు వేగంగా పెరుగుతుంది.
వేసవిలో జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే పిల్లలు తగినంత నీరు తాగేలా చూడండి.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. మీ పిల్లలకు ఏదైనా నూనె పడకపోతే లేదా అలర్జీ అనిపిస్తే వెంటనే వాడటం ఆపివేసి డాక్టర్ ను సంప్రదించండి.