ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌లో ఆదివారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులను ఏరివేయడమే లక్ష్యంగా కాంకేర్-గారియాబంద్ ప్రాంతంలో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఈక్రమంలో భద్రతా దళాలు రాకను గుర్తించిన నక్సలైట్ల వారిపై ఎదురుకాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన భద్రతా దళాలు వెంటనే కాల్పులు ప్రారంభించారు. ఇద్దరి మధ్య చాలా సేపు ఎదురుకాల్పులు కొనసాయిగా. ఈ ఎన్‌కౌంటర్ ముగ్గురు మావోయిస్టుల మృతి చెందారు. మృతి చెందిన ముగ్గురిపై రూ.14 లక్షల రివార్డు ఉన్నట్టు భద్రతా దళాలు గుర్తించారు. మృతుల్లో మహిళతో సహా ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు గుర్తించారు.
ఘటనా స్థలంలో వారి నుంచి భారీ మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకన్నారు. వాటిలో SLR రైఫిల్, 303 రైఫిల్, 12 హ్యాండ్ గన్‌లు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇక ఎదురుకాల్పుల్లో మృతి చెందిన ముగ్గురిలో సర్వాన్ మడ్కం, రాజేష్ అలియాస్ రాకేష్ హేమ్లా, బసంతి కుంజమ్ ఉన్నట్టు అధికారులు తెలిపారు. వారిలో ఒకరిపై రూ.8లక్షలు, మరొకరిపై రూ.5 లక్షలు, మరో వ్యక్తిపై రూ1 లక్ష రివార్డ్‌లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుల్లో ఒకరైన సర్వాన్ మావోయిస్టు కోఆర్డినేషన్ ఏరియా కమిటీ కార్యదర్శిగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. రాజేష్ నగరి ఏరియా కమిటీ గోబ్రా LOS కమాండర్ అని. ఈ కాల్పుల ఘటనపై బస్తర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్‌రాజ్ మాట్లాడుతూ.. మావోయిజం అంతరించిపోయే దశలో ఉందనే వాస్తవాన్ని మావోయిస్టు కార్యకర్తలు అంగీకరించాలని అన్నారు. ప్రభుత్వ పునరావాస విధానాన్ని సద్వినియోగం చేసుకుని హింస మార్గాన్ని విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.