Chhattisgarh: చితికిన బతుకులు.. స్టీల్‌ప్లాంట్‌ వద్ద ప్రమాదం.. ఆరుగురు మృతి, మరో ఆరుగురు..

Chhattisgarh: చితికిన బతుకులు.. స్టీల్‌ప్లాంట్‌ వద్ద ప్రమాదం.. ఆరుగురు మృతి, మరో ఆరుగురు..


ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది.. ఓ ప్రైవేట్‌ స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదవశాత్తు ఓ నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు మృతి చెందగా, పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లుగా తెలిసింది. గోదావరి ఇస్పాట్ లిమిటెడ్‌కి చెందిన ప్లాంట్‌లో నిర్మాణ భాగం కూలిపోవడంతో ఆరుగురు కార్మికులు మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సిల్తారా ప్రాంతంలో ఉన్నఈ ప్లాంట్‌లో ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

శిథిలాల కింద చిక్కుకున్న ఆరుగురి మృతదేహాలను రెస్యూటీం సహాయంతో బయటకు తీశారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్టుగా రాయ్‌పూర్‌ ఎస్పీ లాల్ ఉమేద్ సింగ్ తెలిపారు. అయితే,కూలిన శిథిలాల కింద మరికొందరు కార్మికులు చిక్కుకుని ఉండే అవకాశముందని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన కార్మికులను సమీపంలోని ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి…

కార్మికుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ఫ్యాక్టరీ ఆవరణ వెలుపల గుమిగూడారు. ప్రమాదం పట్ల యాజమాన్యం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. యూనియన్ ప్రతినిధులు, ప్లాంట్ యాజమాన్యం మృతుల, గాయపడిన వారి కుటుంబాలకు సహాయం చేయడానికి సమన్వయం చేసుకుంటున్నారు., అదే సమయంలో రెస్క్యూ బృందాలు విస్తృతంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. కూలిపోవడానికి ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *