ఈసారి పులసలు అటు మత్స్యకారులను, ఇటు పులస ప్రియులను నిరాశకు గురిచేశాయనే చెప్పాలి. వీరి నిరాశను దూరం చేస్తూ.. గోదావరి ప్రజలు ఎంతో ఇష్టపడే మరో రకం చేపలు.. చీరమేను.. వచ్చేసింది. గోదావరి జిల్లాల్లో మాత్రమే దొరికే ఈ అరుదైన చిట్టి చిట్టి చేపలను మత్స్యకారులు చీరలతో పడతారు. అందుకే వీటికి చీరమేను అని పేరు. ఇప్పుడు ఈ చీరమేను యానాం మార్కెట్లో సందడి చేస్తోంది. పులస తర్వాత అంతటి రుచిని ఇస్తుంది. ధరలోనూ ఇవి ఏమాత్రం తక్కువ కాదు. అందుకే మాంసప్రియులు చీరమేను కోసం పోటీ పడుతున్నారు. గోదావరి జిల్లాలో అమితంగా ఇష్టపడే చీరమేను యానాం మార్కెట్ లో హల్ చల్ చేస్తోంది. ఈ చేపలను కేజీల్లో కాకుండా కుంచాలు, బక్కెట్లతో కొలిచి అమ్ముతారు. అంతేకాదు పులస చేపల్లాగే వీటికీ వేలం నిర్వహిస్తారు. ఈ వేలంలో ఒక బకెట్ చీరమేను 26 నుంచి 28 వేలు ధర పలికింది. సేరు అంటే లీటరు చీరమేను 3,000 రూపాయల చొప్పున విక్రయించారు మత్స్యకారులు. ఏడాది కి ఒక్కసారి మాత్రమే దొరికే చీరమేనును కొనడానికి మాంస ప్రియులు ఎగబడ్డారు. గోదావరి జిల్లాలో మాత్రమే దొరికే అరుదైన చేప చీరమేను. కాలక్రమేణా మత్యకారులు చీర మేనును పట్టుకోవడాని కి ప్రత్యక వలలు రూపొందించారు. ఏటా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో మాత్రమే చీరమేను లభిస్తుంది. సముద్రం, గోదావరి కలిసే ప్రాంతాల్లో మాత్రమే దొరికే అరుదైన చిన్న చేప చీర మేను. దీనిని మత్యకారులు సేరు,తవ్వ, డొక్కు తో కొలిచి అమ్ముతారు. గోదావరి జిల్లా ప్రాంత వాసులకు మాత్రమే చీరమేను వండటం తెలుసు. చీరమేనును గారెలు, చింతకాయ, మసాలాతో కలిపి కూరలా వండుతారు. చీర మేనును ఎంత ధర అయినా వెచ్చించి కొనుగోలు చేసి దేశ, విదేశాల్లో ఉన్న.. బంధువులకు పంపుతూ ఉంటారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కరివేపాకు కోద్దామని పెరట్లోకి వెళ్లింది..కళ్లు మూసి తెరిచేంతలో ఆమె
అమెరికాలో భారత విద్యార్థులకు కొత్త టెన్షన్
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ రైల్వేలో 8,875 ఉద్యోగాలకు నోటిఫికేషన్
సినీ రంగంలోకి హీరో సూర్య కూతురు!
ఐటీ ఉద్యోగులు ఎగిరి గంతేసే వార్త..