
రెండు సిమ్ లు వాడేవాళ్లు రెండో సిమ్ తో పని లేకపోయినా దాన్ని యాక్టివ్ గా ఉంచేందుకు ఏదో ఒక ప్లాన్ తో రీఛార్జ్ చేయక తప్పదు. అందుకే మార్కెట్లో ఉన్న ప్లాన్స్ లో తక్కువ రేటు ఉన్న ప్లాన్స్ ఎంచుకుంటే సరి. ఈ ప్లాన్స్ మీ మీ సెకండరీ సిమ్‌ను ఎక్కువ కాలం యాక్టివ్ గా ఉంచడంతోపాటు మీకు ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ కాల్స్, ఎస్ ఎంఎస్, ఇంటర్నెట్ యాక్సెస్‌ను కూడా అందిస్తాయి.
జియో
జియోలో రూ.448 పెట్టి రీఛార్జ్ చేస్తే.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ వస్తుంది. అన్ లిమిటెడ్ కాలింగ్ తో పాటు 1,000 ఎస్ ఎం ఎస్ లు వస్తాయి. ఈ ప్లాన్ లో డేటా ప్యాక్ ఉండదు. సెకండరీ సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోడానికి ఈ ప్లాన్ పనికొస్తుంది.
జియోలో రూ. 1748 పెట్టి రీఛార్జ్ చేస్తే.. 336 రోజుల వ్యాలిడిటీ వచ్చే మరో ప్లాన్ కూడా ఉంది. ఇందులో అన్ లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. ఇది కూడఅ సెకండరీ సిమ్ కోసం బెస్ట్ ఆప్షన్.
ఎయిర్‌టెల్
ఎయిర్ టెల్ లో రూ. 469 పెట్టి రీఛార్జ్ చేస్తే.. 84 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. అన్ లిమిటెడ్ కాలింగ్, 900 ఎస్ ఎం ఎస్ లు వస్తాయి. సెకండరీ సిమ్ ఎయిర్ టెల్ ఉన్న వాళ్లకు ఇదే చీప్ అండ్ బెస్ట్ ఆప్షన్. అలాగే రూ.1849 పెట్టి రీఛార్జ్ చేస్తే.. 365 రోజుల వ్యాలిడిటీ వచ్చే మరో ప్లాన్ కూడా ఉంది. ఇందులో అన్ లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. డేటా ఉండదు. ఇది కూడా సెకండరీ సిమ్ కు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
వీఐ
ఇక వీఐ విషయానికొస్తే.. ఇందులో రూ.470 ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే.. 84 రోజుల వ్యాలిడిటీ, 900 ఎస్ ఎంఎస్ లు , అన్ లిమిటెడ్ కాలింగ్ వస్తాయి. ఏడాది ప్లాన్ కావాలనుకుంటే రూ. 1189 పెట్టి రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో కేవలం 50 జీబీ డేటా మాత్రమే వస్తుంది. 365 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. సిమ్ యాక్టివ్ గా ఉంచుకోడానకి సరిపోతుంది. అన్ లిమిటెడ్ కాలింగ్ కూడా కావాలి అనుకుంటే రూ.1849 పెట్టి రీఛార్జ్ చేసుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..