హైదరాబాద్, సెప్టెంబర్ 25: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్సీ) బోర్డు పరిధిలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వచ్చే ఏడాది జరగనున్న 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను సీబీఎస్‌ఈ విడుదల చేసింది. ఈ మేరకు పరీక్షల పూర్తి షెడ్యుల్‌ను సీబీఎస్సీ బోర్డు అధికారిక వెబ్‌సైట్ లో ఉంచింది. తాజా షెడ్యూల్ ప్రకారం సీబీఎస్సీ బోర్డు పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభంకానున్నాయి. మరోవైపు 2026 నుంచి పదో తరగతి పరీక్షలు ఏడాదికి రెండుసార్లు నిర్వహించనున్నట్లు ఇప్పటికే సీబీఎస్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకనుగుణంగా తాజా షెడ్యూల్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు రూపొందించింది.
సీబీఎస్సీ బోర్డు 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తాజా షెడ్యూల్ ప్రకారం పదో తరగతి పరీక్షలను తొలి విడతలో ఫిబ్రవరి 17 నుంచి మార్చి 6 వరకు, ఇక రెండో విడత పరీక్షలను మే 15 నుంచి జూన్ 1వరకు నిర్వహించనున్నట్లు సీబీఎస్‌ఈ కంట్రోలర్ (ఎగ్జామ్స్) సన్యం భరద్వాజ్ వెల్లడించారు. ఇక సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 9 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షల పూర్తి టైం టేబుల్ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
ఇక పరీక్షలు పూర్తయిన అనంతరం ప్రతి సబ్జెక్టు పరీక్షకు దాదాపు పది రోజుల తర్వాత సమాధాన పత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభమవుతుంది. ఇలా పూర్తి మూల్యాంకనం ప్రక్రియ 12 రోజుల్లో పూర్తవనుంది. అయితే ప్రస్తుతం బోర్డు విడుదల చేసిన పరీక్షల షెడ్యూల్ తాత్కాలికమైందని సీబీఎస్‌ఈ తెలిపింది. పాఠశాలల నుంచి తుది నివేదికలు సేకరించిన తర్వాత వాటి తుది షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. కాగా ఈ ఏడాది దేశ వ్యాప్తంగా దాదాపు 45 లక్షలకు పైగా విద్యార్థులు 10, 12వ తరగతి పరీక్షలకు హాజరవనున్నట్లు బోర్డు తెలిపింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.