Catherine Tresa: మెగా మ్యాజిక్‌తో కేథరిన్ జోరు.. ఇటు సినిమాలు, అటు ఓపెనింగ్స్..!

Catherine Tresa: మెగా మ్యాజిక్‌తో కేథరిన్ జోరు.. ఇటు సినిమాలు, అటు ఓపెనింగ్స్..!


కేథరిన్ థ్రెసా.. పేరు గుర్తుందిగా..! దాదాపు పుష్కరం కింద ఇద్దరమ్మాయిలతో, రుద్రమదేవి లాంటి సినిమాలతో ఒకప్పుడు టాప్ లేపిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత కాస్త స్లో అయిపోయారు. మళ్లీ ఇన్నాళ్లకు అమ్మడి పేరు బాగా వినిపిస్తుంది. ఒక్క సినిమాతో జాతకం మారిపోవడం అంటే ఇదే మరి. నిన్నమొన్నటి వరకు కూడా సినిమాలు పెద్దగా లేకుండా ఖాళీగా ఉన్నారు కేథరిన్ థ్రెసా. కానీ ఒక్క సినిమాతో అమ్మడు మళ్లీ బిజీ అయిపోయారు. ఆ సినిమా ఏంటో తెలుసు కదా.. మెగాస్టార్ చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు. ఈ సినిమా తర్వాత కేథరిన్ పేరు మళ్లీ మోర్మోగిపోతుంది. హీరోయిన్లకు సినిమాలు ఎంత ముఖ్యమో.. ఓపెనింగ్స్ కూడా అంతే. వీళ్లు రెండూ రెండు కళ్లలా ఫీల్ అవుతుంటారు. తాజాగా కేథరిన్ సైతం సినిమాలు చేస్తూనే.. మరోవైపు షాప్ ఓపెనింగ్స్, ఇతర కార్యక్రమాలతో బిజీ అయిపోయారు. ముఖ్యంగా చిరంజీవి సినిమా తర్వాత కేథరిన్ మళ్లీ బిజీ అయిపోయారు. ఈ క్రమంలోనే ఈమె హైదరాబాద్‌లోని హిమయత్‌నగర్ తిరుమల ఎస్టేట్‌లో ప్రముఖ హెల్త్, వెల్‌నెస్ సంస్థ ‘కలర్స్ హెల్త్ కేర్’లోని నూతన బ్రాంచ్ ‘కలర్స్ హెల్త్ కేర్ 2.0’ను ఘనంగా ప్రారంభించింది.

ఈ కార్యక్రమానికి కేథరీన్ థ్రెసానే ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ఆవిష్కరించారు. ఒక్క సినిమాతో మళ్లీ మునపటి ఫామ్‌లోకి వచ్చేసారు ఈ బ్యూటీ. మన శంకరవరప్రసాద్ గారులో చిరు పక్కనే సినిమా అంతా కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వరస ఆఫర్స్‌తో పాటు బయట కూడా ప్రైవేట్ ఈవెంట్స్ బాగానే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈమె కలర్స్ హెల్త్ కేర్ ఓపెన్ చేసారు. ఆధునిక సాంకేతికతతో రూపుదిద్దుకున్న సౌకర్యాలను పరిశీలించిన కేథరీన్ థ్రెసా.. సంస్థ అందిస్తున్న సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇటీవల ప్రతి ఒక్కరూ లైఫ్‌స్టైల్, ఫిట్‌నెస్, ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రజలకు అందం, ఆరోగ్యం కలగాలంటే ఇలాంటి ఆధునిక కేంద్రాలు అవసరం. ‘కలర్స్ హెల్త్ కేర్ 2.0’ ద్వారా నాణ్యమైన సేవలను అత్యాధునిక టెక్నాలజీతో అందించడం అభినందనీయం. ప్రతి ఒక్కరూ ఫిట్‌గా ఉండేందుకు సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలని పేర్కొన్నారు. చెప్పడమే కాదు.. కేథరిన్ కూడా ఫిజిక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

పదేళ్ల కింద ఎలాగైతే ఉన్నారో.. ఇప్పటికీ అదే ఫిజిక్ మెయింటైన్ చేస్తూ మ్యాజిక్ చేస్తున్నారు ఈ బ్యూటీ. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న క‌ల‌ర్స్ హెల్త్‌కేర్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట శివాజీ కూన మాట్లాడుతూ.. 2004లో ప్రారంభమైన కలర్స్ హెల్త్ కేర్ లక్షలాది మంది కస్టమర్ల విశ్వాసాన్ని గెలుచుకుంది. 22 సంవత్సరాల నుండి 52 బ్రాంచిలు పూర్తయ్యాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా సేవలను అప్‌డేట్ చేస్తూ 2.0గా రూపాంతరం చెందింది. దేశవ్యాప్తంగా విస్తరణలో భాగంగా హిమయత్‌నగర్ బ్రాంచ్‌ను ప్రారంభించడం సంతోషకరం. హిమయత్‌నగర్ బ్రాంచ్‌ను ఆవిష్కరించిన కేథరీన్ థెరీసాకు కృతజ్ఞతలు. 22 ఏళ్ల అనుభవం మాకు మరింత నమ్మకం ఇచ్చింది. నగర ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ బ్రాంచ్‌ను ఏర్పాటు చేశాం. యూఎస్-ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన టెక్నాలజీతో అధిక బరువు, హెయిర్, స్కిన్ సమస్యలకు అంతర్జాతీయ ప్రమాణాల చికిత్సలను అందిస్తున్నాం ఆరోగ్యంగా, అందంగా ఉండాలన్న ప్రతి ఒక్కరి ఆశకు కలర్స్ హెల్త్ కేర్ ఎల్లప్పుడూ తోడ్పడుతుందన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *