Car Safety: కారు కొనేముందు ఈ సేఫ్టీ ఫీచర్స్ చెక్ చేయడం మర్చిపోవద్దు!

Car Safety: కారు కొనేముందు ఈ సేఫ్టీ ఫీచర్స్ చెక్ చేయడం మర్చిపోవద్దు!


రోడ్డు ప్రయాణాలు రిస్క్‌తో కూడుకున్నవి. కాబట్టి కారులో ఎన్ని సేఫ్టీ ఫీచర్లు ఉంటే అంత మంచిది. ముందుగా కారు కొనేముందు దాని బ్రాండ్, స్పీడ్‌ వంటి విషయాలతోపాటుగా అది ఎంత సేఫ్ గా మనల్ని తీసుకెళ్తుంది అనేది కూడా చెక్ చేసుకోవాలి. అదెలాగంటే..

సేఫ్టీ ర్యాంకింగ్

కారులో మొదట చూడాల్సినంది సేఫ్టీ ర్యాంకింగ్. కారు ప్రమాదాలను ఎంతమేరకు తట్టుకోగలదు అనేది టెస్ట్ చేసి ఈ సేఫ్టీ ర్యాంకింగ్స్ ఇస్తారు. దీన్నే గ్లోబల్  ‘ఎన్‌సీఎపీ’ రేటింగ్ అంటారుఉ. కారుకి కనీసం మూడు నుంచి నాలుగు స్టార్ల రేటింగ్ అయినా ఉండాలి. ఐదు స్టార్లు ఉంటే ఇంకా మంచిది.

ఎయిర్ బ్యాగ్స్ ముఖ్యం

కారులో ప్రతీ సీటుకి ఎయిర్ బ్యాగ్స్ ఉండాలి. ఇప్పుడొస్తున్న చాలా కార్లలో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉంటున్నాయి. ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్‌తో పాటు సైడ్ బ్యాగ్స్ కూడా వస్తున్నాయి. ఇలా ఎన్ని ఎక్కువ బ్యాగ్స్ ఉంటే అంత సేఫ్ అన్నట్టు లెక్క. కాబట్టి ఎక్కువ ఎయిర్ బ్యాగ్స్ ఉన్న కారుని ఎంచుకోడానికి ప్రయత్నించండి!

స్టెబిలిటీ కంట్రోల్

కారులో ఉండాల్సిన మరో సేఫ్టీ ఫీచర్.. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్. కారు వేగంగా వెళ్తున్నప్పుడు స్టీరింగ్ అదుపు తప్పకుండా ఉండేందుకు ఈ ఫీచర్ పనికొస్తుంది. స్టీరింగ్ ఆటోమేటిక్‌గా టర్న్ అవ్వకుండా కంట్రోల్ చేసి కారు దొర్లకుండా కాపాడుతుంది. ఇప్పుడొస్తున్న కార్లలో చాలావాటికి ఈ ఫీచర్ ఉంటుంది. కాబట్టి ఈ ఆప్షన్ ఉన్న కారుకి ప్రఫరెన్స్ ఇవ్వండి.

సెన్సార్లు

కారులో తప్పనిసరిగా కెమెరాలు, సెన్సార్లు ఉండాలి. ముందు  లేదా వెనుక వైపు ఏదైనా అడ్డు వస్తే అలర్ట్  చేసే సెన్సర్లు, పార్కింగ్ అసిస్టెన్స్, ఆటోమేటిక్ స్టాపింగ్ వంటి ఫీచర్లు ఇప్పుడు చాలా కార్లలో వస్తున్నాయి. ఇవి లేకపోతే డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి సెన్సర్లు చాలా ముఖ్యం.

ఏబీఎస్

కారులో బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఎంతో ముఖ్యమైన విభాగం. ముఖ్యంగా కారుకి ‘యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్(ఏబీఎస్)’ తప్పక ఉండాలి. సడన్‌గా బ్రేక్ వేసినప్పుడు టైర్లు జారిపోయి కారు అదుపు తప్పకుండా ఈ టెక్నాలజీ కాపాడుతుంది.

ఇవి కూడా..

ఇక వీటితోపాటు ‘టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్’ అనే ఫీచర్.. టైర్లలో ఎంత ప్రెజర్ ఉంది అనేది తెలియజేస్తుంది. ‘ట్రాక్షన్ కంట్రోల్’ అనే ఫీచర్ అన్ని టైర్లు ఒకే స్పీడ్‌తో తిరిగేలా చూస్తుంది. స్కిడ్ అవ్వడాన్ని తగ్గిస్తుంది. పిల్లలు సీట్‌లోనుంచి జారిపోకుండా ‘ఐసోఫిక్స్ మౌంట్స్’ ఉండాలి. ఇలాంటి ఫీచర్లు అన్నీ ఉంటే అది సేఫ్ కారు కింద లెక్క.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *