Car Modification: కారుని క్యారవాన్‌గా మార్చుకోవచ్చు.. ఇలా చేస్తే చాలు!

Car Modification: కారుని క్యారవాన్‌గా మార్చుకోవచ్చు.. ఇలా చేస్తే చాలు!


Car Modification: కారుని క్యారవాన్‌గా మార్చుకోవచ్చు.. ఇలా చేస్తే చాలు!

మీ కారుని క్యారవాన్ గా మార్చుకోవడం ద్వారా ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లొచ్చు. ఈ క్యారవాన్ ట్రావెలింగ్ అనే ట్రెండ్ ఎప్పటి నుంచో ఉన్నా మనదేశంలో అలాంటి టూర్స్ చేసేవాళ్లు చాలా తక్కువ. క్యారవాన్ అంటే అన్ని వసతులతో కూడిన వాహనం. రెగ్యులర్ గా వాడే కార్స్ నే క్యారవాన్స్ గా మార్చుకోవచ్చు. సోలో టూర్స్ తో పాటు  ఫ్యామిలీ టూర్స్‌కు కూడా ఇది సూట్ అవుతుంది. మరి కారుని క్యారవాన్ గా మార్చుకోవడం ఎలా? ఇప్పుడు చూద్దాం.

ప్రిపరేషన్ ఇలా..

క్యారవాన్‌ను రెడీ చేసుకోవడం చాలా ఈజీ. కారు లేదా ఎస్‌యూవీని కారవాన్‌గా మార్చుకోవచ్చు. వ్యాన్ లాంటిదైతే ఇంకా బాగుంటుంది. ముందుగా కారులో డ్రైవర్ సీట్ తప్ప మిగతా సీట్లన్నీ తొలగించాలి. అప్పుడు కారులోపల అంతా ఖాళీ అవుతుంది. కారు ఎత్తుని బట్టి రెండు మూడు అడుగుల ఎత్తులో బల్లాలు లేదా ఐరన్ గ్రిల్స్ లాంటివి ఏర్పాటు చేసుకోవాలి. వాటిపైన బెడ్స్ అమర్చితే క్యారవాన్ రెడీ.  గ్రిల్స్ కింద స్పేస్‌ను లగేజీ కోసం వాడుకోవచ్చు. పైన బెడ్స్ వంటివి అమర్చుకోవచ్చు. ఒకవేళ పెద్ద వ్యాన్ అందుబాటులో ఉంటే అందులోనే చిన్న కిచెన్, టాయిలెట్ వంటివి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. చిన్న కారు అయితే పోర్టబుల్ స్టవ్, కన్వర్టెడ్ టాయిలెట్స్ వంటివి తీసుకెళ్లాలి. క్యారవాన్ రెడీ అయ్యాక దానికి ఎక్స్‌ట్రా బ్యాటరీలతో పవర్ సప్లై ఏర్పాటుచేసుకోవాలి. ఛార్జింగ్, వైఫై మోడెమ్స్, లైట్స్ వంటివి సెట్ చేసుకోవాలి. ఫుడ్, టెంట్, వాటర్ ఇతర సామాన్లన్నీ బెడ్స్ కింద సెట్ చేసుకోవాలి. కారుకి పైన లగేజీ క్యారియర్ ఉంటే అదనపు లగేజీని అక్కడ పెట్టుకోవచ్చు.

ప్లానింగ్ ఇలా..

ఇండియాలో ఉన్న కార్స్ లో మారుతి ఈకో, స్కార్పియో, ఫోర్స్ ట్రావెలర్, బొలెరో, ఇన్నోవా వంటివి క్యాంపింగ్ సెటప్ కు సూట్ అవుతాయి. ఇందులో ఎంతమంది సౌకర్యంగా వెళ్లగలరో నిర్ణయించుకుని దానికి తగ్గట్టు ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి. ముందుగా రెడీ చేసుకున్న మ్యాప్స్‌లోని ప్రాంతాలను కవర్ చేస్తూ ఎప్పటికప్పుడు ఏదైనా సిటీ లేదా విలేజ్‌కి దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. అయితే కారవాన్స్ టూర్స్ చేసేవాళ్లు కనెక్టివిటీ మిస్ అవ్వకుండా జాగ్రత్తపడాలి. ఇలాంటి ట్రిప్స్  చేయాలంటే.. ఎక్కువగా రోడ్లపై లేదా ఖాళీ ప్రదేశాల్లోనే  టైం స్పెండ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. క్యారవాన్ టూర్ ఎంత ప్రిపేర్డ్‌గా ఉంటే అంత బాగుంటుంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *