కారులో అనవసరంగా ఏసీ వాడటం వల్ల మైలేజ్ 10 నుంచి 15 శాతం తగ్గుతుందని మీకు తెలుసా? అంతేకాదు ఏసీ ప్యానెల్ ను సరిగ్గా వాడకపోతే కూలింగ్ సిస్టమ్ కూడా పాడవుతుంది. ఫలితంగా కూలింగ్ తగ్గుతుంది. అందుకే కారు ఓనర్లు ఏసీ ప్యానెల్ గురించి పూర్తిగా తెలుసుకోవడం ముఖ్యం. కారులోని ఏసీ సిస్టమ్ ను ఎలా వాడాలంటే..
మైలేజ్ పై ఎఫెక్ట్
కారులో ఉండే ఏసీ కంప్రెషర్.. కారు ఇంజిన్ ద్వారా పనిచేస్తుంది. అందుకే ఏసీ ప్యానెల్ ను సరిగ్గా మెయింటెయిన్ చేసుకోకపోతే.. ఆ భారం ఇంజిన్ పై పడుతుంది. తద్వారా కారు ఎక్కువ ఫ్యుయెల్ తాగుతుంది. ఇలా మైలైజ్ తగ్గడం తో పాటు కారు పెర్ఫామెన్స్ కూడా తగ్గుతుంది. ఏసీ ప్యానెల్ సెట్టింగ్ ను బట్టి కారు మైలైజ్ 10 నుంచి 15 శాతం వరకూ తగ్గొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఫ్యాన్ స్పీడ్
చాలామంది కారు త్వరగా కూల్ అవ్వాలని.. ఫ్యాన్ స్పీడ్ ఎక్కువగా పెడుతుంటారు. దానివల్ల ఏసీ కూలింగ్ పెరుగుతుంది అనుకుంటారు. కానీ, అలా జరగదు. ఫ్యాన్ స్పీడ్ పెంచడం వల్ల గాలి ప్రవాహం మాత్రమే పెరుగుతుంది. ఏసీ కూలింగ్ పెరగదు. కారు త్వరగా చల్లబడాలంటే.. ఫ్యాన్ స్పీడ్ తగ్గించి ఏసీ టెంపరేచర్ ను లిమిట్ లో ఉంచాలి. అప్పుడే మెల్లగా కారు కూలింగ్ అవుతుంది.
టెంపరేచర్ ఇలా..
కారులో ఏసీ టెంపరేచన్ ఎప్పుడూ 22 నుంచి 24 డిగ్రీల వద్ద సెట్ చేయడం బెస్ట్ ఆప్షన్. అంతకంటే తక్కువ పెడితే.. ఏసీ సిస్టమ్ తోపాటు కారు ఇంజిన్ పై లోడ్ పెరుగుతుంది.
ఏసీ వెంట్స్ డైరెక్షన్
కారులో ఏసీ డైరెక్షన్ ను సూచించే వెంట్స్ ను చాలామంది ముఖానికి పెట్టుకుంటుంటారు. దీనికి బదులు కారుపై భాగం వైపు సెట్ చేస్తే.. క్యాబిన్ అంతా సమానంగా కూలింగ్ అవుతుంది.
ఇలా చేయాలి
మీ కారు ఏసీ ప్యానెల్ ను సరిగ్గా ఉపయోగించాలనుకుంటే ముందుగా కారు ఆన్ చేశాక రీసర్క్యులేషన్ మోడ్‌ను ఆన్ చేయాలి. రీసర్క్యులేషన్ మోడ్ బటన్‌ను నొక్కి కాసేపు వెయిట్ చేయడం ద్వారా కారు లోపలకి గాలి సర్క్యులేట్ అవుతుంది. బయటి నుంచి వేడి గాలి రాకుండా చేస్తుంది. ఫలితంగా కారు చల్లబడుతుంది. దీనివల్ల కారు రన్నింగ్ లో ఉన్నప్పుడు ఏసీ సిస్టమ్ పై లోడ్ తగ్గుతుంది
ఇక రెండో విషయం ఫ్యాన్ వేగాన్ని మీడియంగా సెట్ చేయండి. కొంతసేపు ఫ్యాన్ స్పీడ్ పెంచి, కారు లోపలి గాలి చల్లబడిన తర్వాత స్పీడ్ 1 లేదా 2 కి తగ్గించండి. ఇలా చేస్తే ఏసీపై లోడ్ తగ్గుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి