ఏదైనా పండుగ వచ్చినా, ఇంట్లో శుభకార్యమైనా అలంకరణకు బంతిపువ్వు కచ్చితంగా ఉండాలి. బంతి పూల రంగు, వాటి అందం కారణంగా వాటికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. పైగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇదే సరైన సీజన్.
ఎకరాకు రూ. 10 లక్షలు
బంతిపూల సాగు చేయడానికి పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. కొద్దిగా స్థలం ఉంటే చాలు. విత్తనాలు చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. ఒకవేళ స్థలం లేకుండా ఒక ఎకరా పొలం కౌలుకి తీసుకోవచ్చు. ఒక ఎకరా భూమిలో సగటున 5,000 నుంచి 8,000 కిలోల వరకు బంతిపువ్వులు పూస్తాయి. దసరా, కార్తీక మాసం సీజన్ లో అయితే కిలో బంతి పూల ధర సుమారు రూ.200 వరకూ ఉంటుంది. అంటే ఎకరా తోటతో సుమారు రూ.10 లక్షల వరకూ ఆదాయం పొందొచ్చు.
సీజన్ టైమ్..
బంతిపూలు చేతికి రావడానికి కనీసం 3 నుంచి 4 నెలల సమయం పడుతుంది. దసరా నుంచి సంక్రాంతి వరకూ ఈ పూలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఒకే సీజన్ లో 5 నుంచి 6 సార్లు పూలు కోతకు వచ్చేలా చేయొచ్చు. సెప్టెంబర్ నెల ఈ సాగుకి సరైన సమయం.
పెంచడం ఈజీ
బంతిపువ్వుల్లో రెండు రకాలు ఉంటాయి. ముద్ద బంతి, ఎర్ర బంతి. ముద్ద బంతినే ఆఫ్రికన్ బంతి అంటారు. తెలుగు రాష్ట్రా్ల్లో దీన్నే ఎక్కువగా పండిస్తారు. పూల దండలు, స్టేజీ డెకరేషన్ కు వీటినే ఎక్కువగా వాడతారు. ఈ పూల చెట్లు ఈజీగా పెరుగుతాయి. నీటి అవసరం కూడా ఎక్కువగా ఉండదు. వారానికి రెండు సార్లు నీరు పోస్తే చాలు. పువ్వులు పూసేటప్పుడు ప్రతి రోజూ నేల తడుపుతూ ఉండాలి. పంటలో ఏదైనా సమస్య వస్తే.. సేంద్రియ ఎరువులు వాడొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి