Business Idea: కొత్త బిజినెస్ కోసం చూస్తున్నారా? దీన్ని మించింది లేదు! పెట్టబడి తక్కువ.. లాభం ఎక్కువ!

Business Idea: కొత్త బిజినెస్ కోసం చూస్తున్నారా? దీన్ని మించింది లేదు! పెట్టబడి తక్కువ.. లాభం ఎక్కువ!


నాటు కోడి మాంసం ఒకసారి రుచి చూస్తే..  ఇక వదలరు. బ్రాయిలర్ కోళ్లతో పోలిస్తే.. నాటు కోడి గుడ్లు, మాంసం చాలా టేస్టీగా ఉండడమే కాకుండా చాలా హెల్దీ కూడా. అందుకే  మార్కెట్లో దీనికి ఎక్కువ డిమాండ్‌ ఉంటుంది. కొత్తగా బిజినెస్ పెట్టాలనుకునేవాళ్లకు దీన్ని మించిన ఆప్షన్ లేదు. అసలు ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి? లాభం ఎంత ఉంటుంది? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

మంచి లాభం

నాటుకోళ్ల బిజినెస్ చేయడానికి 3 నుంచి 4 లక్షల పెట్టుబడి సరిపోతుంది.  కొంత ఓపెన్ ప్లేస్ లేదా షెడ్ వంటివి ఉంటే చాలు. సులువుగా కోళ్లు పెంచుతూ లాభాలు ఆర్జించొచ్చు. మార్కెట్లో ఒక్కో నాటు కోడి ధర సుమారుగా రూ. 700 నుంచి రూ. 1000 వరకూ ఉంటుంది. నెలకు ఒక వంద కోళ్లు అమ్మినా.. నెలకు రూ. లక్ష వరకూ లాభం ఉంటుంది. అయితే నాటు కోళ్లు పెంచడంలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి.

రకాన్ని బట్టి రేటు..

బ్రాయిలర్ కోళ్లతో పోలిస్తే.. నాటు కోడి పెరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. కోడి పిల్ల నుంచి పెద్ద కోడి అవ్వడానికి వరకు సుమారు 6 నెలల పైగా పడుతుంది. ఈ కోళ్లకు సజ్జలు, రాగులు, జొన్నల వంటి మంచి ఫుడ్ పెట్టాల్సి ఉంటుంది. రోగాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  నాటుకోళ్లలో వానరాజా,  గిరి రాజా, రాజశ్రీ,  కడకనాథ్, స్వర్ణ దార, సోనాలి.. ఇలా పలు రకాలుంటాయి. కోడి రకం, బరువుని బట్టి ధర మారుతుంటుంది. ఈ కోళ్లను తమిళనాడు, కేరళ, బెంగుళూరు, వంటి  ప్రాంతాలకు కూడా ఎగుమతి చేసే వాళ్లున్నారు.

గుడ్లు కూడా..

ఇకపోతే నాటు కోడి గుడ్డుకి కూడా మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. నాటు కోళ్లు బ్రాయిలర్ల కంటే ఎక్కువ గుడ్లు పెడతాయి. ఈ గుడ్డులో ఎక్కువ ప్రొటీన్లు, విటమిన్లు ఉంటాయి.  అందుకే వీటి రేటు ఎక్కువ. కాబట్టి ఈ బిజినెస్ లో ఉన్నవాళ్లు నాటు కోడి మాంసంతో పాటు, గుడ్లను విక్రయిస్తూ కూడా డబ్బులు సంపాదించవచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *