Budget Planning: నెల జీతం సరిపోక అప్పు చేస్తున్నారా? ఇలా చేసి చూడండి!

Budget Planning: నెల జీతం సరిపోక అప్పు చేస్తున్నారా? ఇలా చేసి చూడండి!


కొద్దిపాటి సంపాదనతో ఇల్లు నెట్టుకొచ్చేవాళ్లను మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈతరం యువతకు సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడం వల్లే డబ్బు విషయంలో ఇబ్బందిపడుతున్నారని ఫైనాన్షియల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ ప్రకారం రూపాయిని ఎలా ఖర్చు చేయాలంటే..

బడ్జెట్ ప్లానింగ్ ఉందా?

ఉద్యోగం చేస్తున్నవాళ్లు ప్రతినెలా ఒకే మొత్తాన్ని జీతంగా పొందుతారు. అలాగే ప్రతినెలలో ఒకేరకమైన అవసరాలు ఉంటాయన్న విషయం కూడా మీకు తెలుసు. మరి అలాంటప్పుడు వస్తున్న జీతంలో ఎంత మొత్తాన్ని ఏయే ఖర్చులకు వాడాలి? అన్న ప్లాన్ మీకు ఉందా? లేకపోతే ముందు ఆ బడ్జెట్ ప్లానింగ్ చేసుకోవడం ముఖ్యం.

ప్లానింగ్‌ ఇలా..

బడ్జెట్ ప్లానింగ్‌లో కొన్ని మెలకువలు పాటించాలి. కొన్నిసార్లు అనుకోని ఖర్చులు రావొచ్చు. కాబట్టి ఎమర్జెన్సీ ఖర్చుల కోసం కొంత మొత్తాన్ని బడ్జె్ట్‌లో కేటాయించాలి. అలాగే అవసరాలు, కోరికలకు విడివిడిగా బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి. జీతాన్ని బట్టి కోరికలను, అవసరాలను సర్దుకోక తప్పదని గుర్తుంచుకోవాలి.

పొదుపు ముఖ్యం

బడ్జెట్‌లో పొదుపు అనేది ప్రధానమైన లక్ష్యంగా పెట్టుకోవాలి. పెరుగుతున్న మీ అవసరాలు, సొంతిల్లు, ఫ్యూచర్‌‌లో ఉండే ఫ్యామిలీ ఖర్చుల వంటివి దృష్టిలో ఉంచుకుని లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేసుకోవడం ముఖ్యం. దీనికోసం ప్రస్తుత అవసరాలు, కోరికలను అదుపులో ఉంచుకోవడం ముఖ్యం. ప్రతి నెలా వచ్చే ఆదాయంలో 30 శాతం డబ్బు పొదుపు చేయడం సరైన విధానమని నిపుణులు చెప్తున్నారు.

కంట్రోలింగ్ ఉండాలి

మార్కెటింగ్ మాయల్లో పడి స్థోమతకు మించి ఖర్చు చేయడం వల్లే నెలాఖరికి అప్పు చేయడం లేదా క్రెడిట్ కార్డ్ వాడడం చేయాల్సివస్తుంది. కాబట్టి ఎవరేమి అనుకున్న మీ ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో మీరు ఉండాలి. మీ లాంగ్ టర్మ్ గోల్స్‌ను దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్లాలి. అప్పు చేయకుండా నెగ్గుకువచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. సరైన క్రమశిక్షణ ఉంటే ఇది పెద్ద విషయమేమీ కాదు.

మరిన్ని సైన్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *